తెలంగాణ

telangana

ETV Bharat / bharat

కేబినెట్​ మంత్రికి, కుటుంబ సభ్యులకు కరోనా

ఉత్తరాఖండ్ కేబినెట్ మంత్రి సత్పాల్​ మహారాజ్​కు ​ కరోనా పాజిటివ్​గా తేలింది. ఆయనతో పాటు కుటుంబ సభ్యుల్లోని నలుగురికి వైరస్​ సోకినట్లు నిర్ధరణయింది. రెండు రోజుల క్రితం జరిగిన కేబినెట్ సమావేశానికి సత్పాల్ హాజరయ్యారు.

NAT-HN-wife of Satpal Maharaj tested corona positive-31-05-2020-Desk
కేబినెట్​ మంత్రి కటుంబం మొత్తానికి కరోనా పాజిటివ్​

By

Published : May 31, 2020, 5:46 PM IST

Updated : May 31, 2020, 6:23 PM IST

కరోనా వైరస్​ మహమ్మారి వ్యాప్తి రోజురోజుకు తీవ్రమవుతోంది. తాజాగా ఉత్తరాఖండ్ కేబినెట్​ మంత్రి సత్పాల్​ మహారాజ్​కు కొవిడ్​ సోకినట్లు వైద్యులు తెలిపారు. ఆయనతో పాటు నలుగురు కుటుంబ సభ్యులకూ వైరస్​ నిర్ధరణయింది. మంత్రి కుమారుడు, కోడలు వైరస్​ బారినపడ్డట్లు సమాచారం.

మొత్తం 41మంది నమూనాలు పరీక్షలకు పంపగా మంత్రి సహా ఆయన కుటుంబంలోని నలుగురికి, మరో 17మందికి పాజిటివ్​గా తేలింది. వీరిలో మంత్రి నివాసంలో పనిచేసేవారు, ఇతర సిబ్బంది ఉన్నారు.

సచివాలయానికి...

రెండు రోజుల క్రితం జరిగిన కేబినెట్​ సమావేశానికి హాజరైన సత్పాల్​కు వైరస్ సోకడం వల్ల అధికారులు ఆందోళన చెందుతున్నారు. సమావేశం రోజు అయనతో పలువురు అధికారులు, సిబ్బంది సన్నిహతంగా ఉన్నట్లు తెలుస్తోంది. దీంతో రాష్ట్ర సచివాలయంలో కరోనా కలవరం మొదలైంది.

ఇప్పటికే సత్పాల్ మహారాజ్ సతీమణి, మాజీ మంత్రి అమృత రావత్ కరోనా బారిన పడ్డారు. దెహ్రాదూన్​లోని మంత్రి నివాసంలో కుటుంబ సభ్యులందరూ హోంక్వారంటైన్​లోకి వెళ్లారు.

ఉత్తరాఖండ్​లో కొత్తగా నమోదైన 33 కేసులతో కలిపి మొత్తం కేసుల సంఖ్య 749కి చేరింది.

Last Updated : May 31, 2020, 6:23 PM IST

ABOUT THE AUTHOR

...view details