తెలంగాణ

telangana

ETV Bharat / bharat

అధ్యక్షుడి రాక: కాండ్లాలో శాటిలైట్ ఫోన్ కలకలం!

గుజరాత్ కాండ్లా తీరంలో ఓ శాటిలైట్ ఫోన్ కలకలం సృష్టించింది. అగ్రరాజ్య అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ వచ్చేవారం భారత్​లో పర్యటించనున్న నేపథ్యంలో ఈ ఫోన్ అనుమానాస్పదంగా కనిపించిన కారణంగా అధికారులు రంగంలోకి దిగారు. ఈ పరికరాన్ని డీఆర్​డీఓకు పంపి అన్ని కోణాల్లో పరిశీలిస్తున్నట్లు తెలుస్తోంది.

trump
అధ్యక్షుడి రాక: కాండ్లాలో శాటిలైట్ ఫోన్ కలకలం!

By

Published : Feb 18, 2020, 9:11 PM IST

Updated : Mar 1, 2020, 6:47 PM IST

అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ వచ్చేవారం భారత్​లో పర్యటించనున్నారు. ఈ నేపథ్యంలో భద్రతను కట్టుదిట్టం చేశారు అధికారులు. కాండ్లా తీరం వద్ద ఓ జాలరికి శాటిలైట్ ఫోన్ లభ్యమవడం కలకలం రేపింది. ఈ అంశమై అధికారులు దర్యాప్తు చేస్తున్నారు.

అయితే అణ్వాయుధం అయి ఉంటుందా అన్న కోణంలో ఆలోచించిన అధికారులు.. ఈ అనుమానాస్పద పరికరాన్ని డీఆర్​డీఓకు తీసుకెళ్లి పరిశీలిస్తున్నారు.

అయితే ఈ పరికరం తొలుత కరాచీలోని వాణిజ్య బోటులో కనిపించిందని తెలుస్తోంది.

ఇదీ చూడండి:'భారత్​కు మరో 10 కొత్త నగరాలు అవసరం'

Last Updated : Mar 1, 2020, 6:47 PM IST

ABOUT THE AUTHOR

...view details