తెలంగాణ

telangana

ETV Bharat / bharat

పన్ను దొంగ పనిబట్టేందుకు ఉపగ్రహం సాయం! - వ్యవసాయం

అధికారుల కళ్లు గప్పారు. కొందరిని దారికి తెచ్చుకున్నారు. ప్రభుత్వాన్ని మోసం చేశారు. ఒకటి కాదు రెండు కాదు... రూ.15కోట్లు పన్ను ఎగ్గొట్టారు. ఎవరూ గుర్తించలేరనుకున్నారు. మూడేళ్ల తర్వాత దొరికారు. ఇందుకు సాయం చేసింది ఓ ఉపగ్రహం.

పన్ను దొంగ పనిబట్టేందుకు ఉపగ్రహం సాయం!

By

Published : Apr 5, 2019, 5:42 AM IST

పన్ను దొంగ పనిబట్టేందుకు ఉపగ్రహం సాయం!
ఓ కేసును పరిష్కరించాలంటే పోలీసులు ప్రత్యక్ష సాక్షులు, ఘటనాస్థలంలో ఆధారాలు లేదా ఫోరెన్సిక్​ నిపుణుల సాయం తీసుకుంటారు. కానీ ఘజియాబాద్​లో ఐటీ అధికారులు ఏకంగా ఉపగ్రహ సహాయమే తీసుకున్నారు. తొలిసారిగా దేశంలో శాటిలైట్​ సాయంతో పన్ను ఎగవేత కేసు పరిష్కరించారు.

ఇదీ కథ...

మూడేళ్ల క్రితం ఉత్తరప్రదేశ్​ గజియాబాద్​లోని మోదీనగర్​లో ఓ వ్యక్తి భూమి కొనుగోలు చేశాడు. వ్యవసాయ భూమి అని చెప్పి రూ.30 లక్షలకే రిజిస్టర్​ చేసుకున్నాడు.
నిజానికి అది వ్యవసాయ భూమి కాదని 2018లో ఐటీశాఖ అధికారులకు ఫిర్యాదు అందింది. కానీ దర్యాప్తు చేసినా ఆధారాలు లభించలేదు. హైదరాబాద్​లో రిమోట్​ సెన్సింగ్​ ఏజెన్సీని సంప్రదించింది ఐటీ శాఖ. ఉపగ్రహం సహాయంతో మూడేళ్ల క్రితం ఆ భూమి ఎలా ఉందన్న నివేదిక తయారు చేసి అప్పగించింది రిమోట్​ సెన్సింగ్​ ఏజెన్సీ. అది వ్యవసాయ భూమి కాదని, అక్కడ వాణిజ్య సముదాయం ఉందని శాటిలైట్​ చిత్రాల ద్వారా స్పష్టమైంది.

ఆ యజమాని రూ. 15 కోట్ల పన్ను ఎగవేతకు పాల్పడ్డట్లు ఐటీ అధికారులు నిర్ధరించారు. రూ.15కోట్లకు తోడు ఆ మొత్తంలో 90శాతం జరిమానాగా వసూలు చేసేందుకు సిద్ధమయ్యారు.

"ఆధునిక సాంకేతికతను ఉపయోగించి అక్రమార్కుల పని పట్టవచ్చు. కొందరు మాది వ్యవసాయ భూమి అని చెబుతారు. గోధుమలు, వరి, చెరకు సాగు చేస్తున్నామని తహశీల్దార్​తో రాయించుకుని వస్తారు. కానీ... అక్కడ ఏ పంట ఉండదు. ఖాళీగా ఉంటుంది. కానీ మేం ఏమీ చేయలేము. అక్కడ పంట ఉందో లేదో మేము నిరూపించలేం. ఇప్పుడు ఈ సాంకేతికత ద్వారా వ్యవసాయ ఆదాయం గురించి సమర్పించే లెక్కల్లో నిజానిజాలు తేల్చవచ్చు."
--- అమ్రేంద్ర కుమార్​, ఆదాయపు పన్నుశాఖ డైరెక్టర్​, కాన్​పుర్​

భూ రిజిస్ట్రేషన్ సమయంలో అక్రమాలకు పాల్పడ్డ సిబ్బందిపైనా ప్రభుత్వం చర్యలు తీసుకుంది.

ABOUT THE AUTHOR

...view details