తమిళనాడు దివంగత నేత జయలలిత స్నేహితురాలు శశికళ ఆరోగ్య పరిస్థితి నిలకడగా ఉన్నట్లు బెంగళూరు ఆసుపత్రి వైద్యులు వెల్లడించారు. ప్రస్తుతం ఆహారం తీసుకుంటున్నారని.. ఇతరుల సహకారంతో నడవగలుగుతున్నట్లు కూడా తెలిపారు. కొవిడ్ నిబంధనలను అనుసరించి చికిత్స అందిస్తున్నట్లు చెప్పారు.
నిలకడగా శశికళ ఆరోగ్య పరిస్థితి - శశికళ ఆరోగ్యం నిలకడ
తమిళనాడు దివంగత నేత జయలలిత స్నేహితురాలు శశికళ ఆరోగ్యం నిలకడగా ఉన్నట్లు వైద్య వర్గాలు తెలిపాయి. ఇతరుల సహకారంతో ఆమె నడవగలుగుతున్నట్లు వెల్లడించాయి.
![నిలకడగా శశికళ ఆరోగ్య పరిస్థితి Sasikala is stable and comfortable](https://etvbharatimages.akamaized.net/etvbharat/prod-images/768-512-10369870-thumbnail-3x2-111.jpg)
'నిలకడగా శశికళ ఆరోగ్య పరిస్థితి'
అక్రమాస్తుల కేసులో జైల్లో ఉన్న శశికళ.. ఈ నెల 27న విడుదల కావాల్సి ఉంది. ఇంతలో వెన్నునొప్పి, శ్వాసకోశ వ్యాధులు ఆమెను ఇబ్బంది పెట్టాయి. దీంతో గురువారం కొవిడ్ పరీక్షలు నిర్వహించగా.. వైరస్ సోకినట్టు తేలింది. ప్రస్తుతం ఆమె బెంగళూరులోని మెడికల్ కాలేజ్, రీసెర్చ్ ఇన్స్టిట్యూట్లో చికిత్స పొందుతున్నారు.
ఇదీ చదవండి:సీబీఐ చేతికి కేరళ 'సోలార్ స్కామ్' కేసు!