తీవ్ర అనారోగ్యంతో బెంగళూరు ఆసుపత్రిలో చేరిన తమిళనాడు దివంగత నేత జయలలిత స్నేహితురాలు శశికళ ఆరోగ్యం కాస్త మెరుగుపడినట్టు వైద్య వర్గాలు తెలిపాయి. ఆమె స్పృహలోకి రావడం సహా.. వైద్యానికి సహకరిస్తున్నారని పేర్కొన్నాయి. ఆమె పల్స్ రేటు నిమిషానికి 67, బీపీ 126/60మిల్లీ మీటర్లుగా ఉన్నాయని వెల్లడించారు వైద్యులు.
స్పృహలోకి శశికళ- ఆరోగ్యం మెరుగు - శశికళ వయసు
తమిళనాడు దివంగత నేత జయలలిత స్నేహితురాలు శశికళ ఆరోగ్యం కాస్త కుదుటపడినట్టు వైద్య వర్గాలు తెలిపాయి. ప్రస్తుతం ఆమె స్పృహలోకి వచ్చారని వెల్లడించాయి.
![స్పృహలోకి శశికళ- ఆరోగ్యం మెరుగు Sasikala is conscious and well-oriented, her pulse rate is 67/minute & blood pressure is 126/60mm: BMCRI](https://etvbharatimages.akamaized.net/etvbharat/prod-images/768-512-10342415-thumbnail-3x2-sasikala.jpg)
మెరుగుపడిన శశికళ ఆరోగ్యం: వైద్య వర్గాలు
అక్రమాస్తుల కేసులో జైల్లో ఉన్న శశికళ.. ఈ నెల 27న విడుదల కావాల్సి ఉంది. ఇంతలో వెన్నునొప్పి, శ్వాసకోశ వ్యాధులు ఆమెను ఇబ్బంది పెట్టాయి. దీంతో గురువారం కొవిడ్ పరీక్షలు నిర్వహించగా.. వైరస్ సోకినట్టుతేలింది. ప్రస్తుతం ఆమె బెంగళూరులోని మెడికల్ కాలేజ్, రీసెర్చ్ ఇన్స్టిట్యూట్లో చికిత్స పొందుతున్నారు.
ఇదీ చదవండి:కమల్ డిశ్ఛార్జ్- ఎన్నికల ప్రచారం ఇప్పట్లో కష్టమే!