తెలంగాణ

telangana

ETV Bharat / bharat

శశికళకు అస్వస్థత- ఆసుపత్రికి తరలింపు - ఆసుపత్రిలో చేరిన శశికల

తమిళనాడు మాజీ ముఖ్యమంత్రి, దివంగత నేత జయలలిత నెచ్చెలి శశికళ అస్వస్థతకు గురయ్యారు. జ్వరం, శ్వాస సంబంధిత సమస్యతో బాధపడుతున్న క్రమంలో ఆసుపత్రికి తరలించారు జైలు అధికారులు.

Sasikala complains of fever
శశికలకు అస్వస్థత

By

Published : Jan 20, 2021, 5:13 PM IST

అక్రమాస్తుల కేసులో బెంగళూరు కేంద్ర కారాగారంలో శిక్ష అనుభవిస్తున్న శశికళ అస్వస్థతకు గురయ్యారు. జ్వరం, తీవ్ర శ్వాస సమస్యతో బాధపడుతున్నట్లు గుర్తించిన అధికారులు​ ఆసుపత్రికి తరలించారు. మంగళవారం రాత్రి నుంచే శ్వాస సమస్యతో బాధపడుతున్నారని తెలిపారు.

జయలలిత అక్రమాస్తుల కేసులో జైలు శిక్ష అనుభవిస్తున్నారు శశికళ. తన నాలుగేళ్ల శిక్షాకాలం పూర్తవుతున్న క్రమంలో ఈనెల 27న జైలు నుంచి విడుదల కానున్నారు.

ఇదీ చూడండి:ఈనెల 27న శశికళ విడుదల!

ABOUT THE AUTHOR

...view details