తెలంగాణ

telangana

ETV Bharat / bharat

సర్పంచ్​ పదవికి వేలం- రూ.2.5 కోట్లకు కొన్న వ్యక్తి! - umrane village in maharashtra

ఎక్కడైనా ఆస్తులను వేలం వేస్తారు. కానీ మహారాష్ట్రలోని ఓ గ్రామంలో సర్పంచ్​ పదవికి వేలం జరిగింది. పదవి కోసం ఓ వ్యక్తి ఏకంగా రూ.2.5 కోట్లను వెచ్చించారు.

Village sarpanch post sold in auction ahead of local body polls in Maharashtra
మహారాష్ట్రలో ఉపసర్పంచ్ పదవి వేలం!

By

Published : Dec 30, 2020, 9:58 AM IST

మహారాష్ట్రలోని నాసిక్​ జిల్లా ఉమ్రానె గ్రామంలో సర్పంచ్ పదవికి వేలం నిర్వహించారు. ఈ వేలంలో రూ.2.5 కోట్లు వెచ్చించి ప్రశాంత్ విశ్వాస్​రావు దేవరా అనే వ్యక్తి పదవిని దక్కించుకున్నారు. ఎలాంటి అభ్యంతరాలు లేకుండా జరిగిన ఈ వేలం.. కోటి పదకొండు లక్షలతో ప్రారంభమైంది.

మహారాష్ట్రలో సర్పంచ్ పదవికి వేలం!
మహారాష్ట్రలో సర్పంచ్ పదవికి వేలం!

కారణం అదే..

ఎన్నికల ప్రక్రియ లేకుండా గ్రామస్థులంతా సర్పంచ్​ను ఏకగ్రీవంగా ఎన్నుకునేందుకే ఈ వేలాన్ని నిర్వహించారు. ప్రశాంత్​ను ఏకగ్రీవంగా ఎన్నుకుంటామని గ్రామస్థులు ప్రకటించారు. అయితే ఈ వేలాన్ని అధికారికంగా నిర్వహించలేదు. వేలంలో వెచ్చించిన డబ్బుతో గ్రామంలో రామేశ్వరస్వామి ఆలయం నిర్మాణం చేపడతారని సమాచారం.

ఇదీ చూడండి :'రజనీ ప్రకటన నన్నూ నిరాశపరిచింది'

ABOUT THE AUTHOR

...view details