భారత్ వరుసగా క్షిపణి పరీక్షలు నిర్వహిస్తోంది. తాజాగా ఒడిశా తీరం నుంచి నిర్వహించిన స్టాండ్ ఆఫ్ యాంటీ ట్యాంక్ (ఎస్ఏఎన్టీ) క్షిపణి పరీక్ష విజయవంతమైంది. ఈ మేరకు రక్షణశాఖ వర్గాలు వెల్లడించాయి.
మరో క్షిపణిని విజయవంతంగా పరీక్షించిన భారత్
భారత్ మరో క్షిపణి ప్రయోగాన్ని విజయవంతంగా నిర్వహించింది. ఒడిశా తీరం నుంచి స్టాండ్ ఆఫ్ యాంటీ ట్యాంక్ (ఎస్ఏఎన్టీ) క్షిపణిని పరీక్షించింది. ఈ క్షిపణిని భారత వాయుసేన కోసం రక్షణ, పరిశోధన అభివృద్ధి సంస్థ (డీఆర్డీఓ) అభివృద్ధి చేసింది.
క్షిపణి
భారత వైమానిక దళ వినియోగం కోసం ఈ క్షిపణిని భారత రక్షణ, పరిశోధన అభివృద్ధి సంస్థ (డీఆర్డీఓ) అభివృద్ధి చేస్తోంది. లాక్‌ఆన్ ఆఫ్టర్ లాంచ్, లాక్‌ఆన్ బిఫోర్ లాంచ్ సామర్థ్యాన్ని ఈ క్షిపణి కలిగి ఉంది.
ఇదీ చూడండి:భారత సైన్యం అదుపులో చైనా జవాను