తెలంగాణ

telangana

ETV Bharat / bharat

సంపూర్ణ సంస్కృత గ్రామం.. కనీస సదుపాయాలు కరవు! - సంస్కృత గ్రామం

అసోం కరీంగంజ్​ జిల్లాలోని పటియాలా గ్రామానికో ప్రత్యేకత ఉంది. ఇక్కడి ప్రజల రోజువారీ సంభాషణ సంస్కృతంలోనే సాగుతుంది. మెల్లమెల్లగా కనుమరుగవుతున్న భారతదేశ ప్రాచీన భాషను ఇక్కడ ఇంకా మాట్లాడటం అరుదైన విషయం. అయితే.. తమకు కనీస సదుపాయాలు దక్కట్లేదని వాపోతున్నారు గ్రామస్థులు. తమను ప్రత్యేకంగా గుర్తించట్లేదని చెబుతున్నారు.

సంపూర్ణ సంస్కృత గ్రామం.. కనీస సదుపాయాలు కరవు!

By

Published : Aug 22, 2019, 5:50 AM IST

Updated : Sep 27, 2019, 8:25 PM IST

సంపూర్ణ సంస్కృత గ్రామం.. కనీస సదుపాయాలు కరవు!

సంస్కృతం... దాదాపు 3,500 ఏళ్ల చరిత్ర కలిగిన భాష. ప్రపంచంలోనే మొట్టమొదటి కావ్యం రామాయణం... సంస్కృత భాషలోనే ఉద్భవించింది. ప్రపంచవిజ్ఞాన చరిత్రలో ఈ భాషకు విశిష్ట స్థానం ఉంది.

అయితే.. ఇప్పుడు ఈ ప్రాచీన భాషను ఎందరు మాట్లాడుతున్నారు? కోట్లాది భారతీయుల్లోనూ ఈ సంఖ్య వేలకే పరిమితం. దేశంలో సంస్కృత గ్రామాలు 7 మాత్రమే. అసోం కరీంగంజ్​ జిల్లాలోని పటియాలా గ్రామంలోనూ పూర్తిగా సంస్కృతమే మాట్లాడుతున్నప్పటికీ ఈ జాబితాలో చేర్చలేదని వాపోతున్నారు గ్రామస్థులు. తమ ఊరు... ఎలాంటి ప్రత్యేక సదుపాయాలు కాదు కదా... కనీస అభివృద్ధికీ నోచుకోవట్లేదని ఆవేదన చెందుతున్నారు.

ఇదీ చూడండి:సీసీటీవీ: మెట్రో రైలు కిందపడి నిరుద్యోగి ఆత్మహత్య!

భాషాభివృద్ధికి కృషి...

పటియాలా గ్రామంలో సంస్కృతం వారి వ్యవహార భాషగా ఉంది. రోజువారీ సంభాషణ అంతా ఈ ప్రాచీన భాషలోనే సాగడం విశేషం. ఈ దేవనగరి భాషను అనర్గళంగా మాట్లాడగలరు. సంస్కృత భాషను విస్తృతం చేసేందుకూ తీవ్రంగా కృషి చేస్తున్నారు. సంస్కృత్​ సంరక్కణ్​, ప్రచార్​ ప్రసార్​ సమితి అనే రెండు కమిటీలు ఏర్పాటుచేశారు. గ్రామంలో తమకు సంస్కృత పాఠశాల, కళాశాల, విశ్వవిద్యాలయం ఏర్పాటుచేయాలని విన్నవిస్తున్నారు.

సంస్కృత చరిత్ర...

సంస్కృతాన్ని మొదట సరస్వతీ లిపిలో రాసేవారు. కాలక్రమేణా ఇది బ్రహ్మీ లిపిగా రూపాంతరం చెందింది. ఆ తర్వాత దేవనాగరి లిపిగా పరివర్తనం చెందింది. ఇలానే తెలుగు లిపి, తమిళ లిపి, బంగాలీ లిపి, గుజరాతీ లిపి, శారదా లిపి వంటివి ఉద్భవించాయి. అనంతరం.. క్రమక్రమంగా సంస్కృతం ప్రాధాన్యం తగ్గుతూ వస్తోంది.

ఇదీ చూడండి:దిల్లీలో రెచ్చిపోయిన దుండగులు... నడిరోడ్డుపైనే చోరీ!

Last Updated : Sep 27, 2019, 8:25 PM IST

ABOUT THE AUTHOR

...view details