విశ్రాంత ఐఏఎస్ అధికారి, రాష్ట్రపతి కార్యదర్శిగా పనిచేసిన సంజయ్ కొఠారి కేంద్ర విజిలెన్స్ కమిషనర్‌గా నియమితులయ్యారు. రాష్ట్రపతి భవన్ వేదికగా జరిగిన కార్యక్రమంలో రాష్ట్రపతి రామ్‌నాథ్ కోవింద్ ఆయనతో ప్రమాణ స్వీకారం చేయించారు.
సంజయ్ కొఠారి.. కేంద్ర విజిలెన్స్ కమిషనర్ ఉపరాష్ట్రపతి వెంకయ్యనాయుడు, ప్రధానమంత్రి నరేంద్రమోదీ సహా కేంద్ర ప్రభుత్వంలోని ప్రముఖులు ఈ కార్యక్రమానికి హాజరయ్యారు. కరోనా వ్యాప్తి నేపథ్యంలో ప్రమాణ స్వీకార కార్యక్రమంలో భౌతిక దూరం పాటించారు. హాజరైన వారందరికీ కుర్చీలను దూరంగా వేశారు.
ఎంపిక కమిటీ సిఫార్సుతో..
గతేడాది జూన్‌లో అప్పటి కమిషనర్ కేవీ చౌదరి పదవీకాలం పూర్తయిన నాటి నుంచి సీవీసీ పోస్టు ఖాళీగా ఉంది. ప్రధాని మోదీ నేతృత్వంలోని ఉన్నతస్థాయి ఎంపిక కమిటీ సిఫారసు మేరకు రాష్ట్రపతి కోవింద్.. కొఠారిని విజిలెన్స్ కమిషనర్‌గా నియమించారు. అయితే కేంద్ర విజిలెన్స్ కమిషన్‌లో ఒక ప్రధాన కమిషనర్‌తో పాటు మరో ఇద్దరు కమిషనర్లు ఉండేందుకు అవకాశం ఉంది. ప్రస్తుతం కమిషనర్‌గా ఉన్న శరద్ కుమార్ తాత్కాలిక ప్రధాన కమిషనర్‌గా బాధ్యతలు నిర్వర్తిస్తున్నారు. తాజా నియామకంతో మరో కమిషనర్ పదవి ఖాళీగా ఉండనుంది.
ఇదీ నేపథ్యం..
1978 ఐఏఎస్ బ్యాచ్‌కు చెందిన సంజయ్ కొఠారి హరియాణా కేడర్‌లో పనిచేశారు. 2016లో పదవీ విరమణ అనంతరం....పబ్లిక్ ఎంటర్ప్రైజెస్ సెలక్షన్ బోర్డు సారథిగా విధులు నిర్వర్తించారు. 2017 నుంచి రాష్ట్రపతి రామ్ నాథ్ కోవింద్ వద్ద కార్యదర్శిగా పనిచేస్తున్నారు.
ఇదీ చూడండి:కరోనాపై పోరు: ఈ సీతలు గీత దాటనీయడం లేదు