తెలంగాణ

telangana

ETV Bharat / bharat

ఈ శానిటరీ ప్యాడ్​తో ఇక కాలుష్యానికి చెక్​!​ - వరి పొట్టుతో శానిటరీ ప్యాడ్

శానిటరీ ప్యాడ్​లు సృష్టిస్తోన్న కాలుష్యం అంతా ఇంతా కాదు. ప్లాస్టిక్​, సింతెటిక్​లతో నిండిన నాప్కిన్​లు మహిళల్లో కేన్సర్​కు ప్రధాన కారణాలు. మరి రుతుక్రమ సమయంలో ఏం వాడాలి అనే సందేహం వస్తోందా? వరి పొట్టుతో తయారు చేసిన ఈ శానిటరీ ప్యాడ్​ వాడితే పర్యావరణానికి, ఆరోగ్యానికి ఎలాంటి హానీ ఉండదు అంటున్నారు ఛత్తీస్​గఢ్​లోని ఓ సామాజిక కార్యకర్త.

ఈ శానిటరీ ప్యాడ్​తో ఇక కాలుష్యానికి చెక్​!​

By

Published : Nov 24, 2019, 5:42 AM IST

ఈ శానిటరీ ప్యాడ్​తో ఇక కాలుష్యానికి చెక్​!​
ఛత్తీస్​గఢ్ ధమ్​తరీ జిల్లాలో కాలుష్య నివారణతో పాటు, మహిళలు, రైతులకు ఎనలేని ఉపకారం చేస్తున్నారు ఓ సామాజిక కార్యకర్త. వృథాగా పారేసే వరి పొట్టు, గడ్డి​తో బయోడీగ్రెడబుల్ శానిటరీ ప్యాడ్​ను తయారు చేశారు.

ఇందిరా గాంధీ కృషి విశ్వవిద్యాలయంలో ఆర్ట్​ ఆఫ్​ లివింగ్​ విభాగ ఫ్యాకల్టీగా పని చేస్తోన్న సుమిత పంజ్వాణీకి మహిళలకు, రైతులకు ఉపయోగపడేలా ఏదైన ఉత్పత్తి చేయాలనే ఆలోచన వచ్చింది. వరిపొట్టు గడ్డితో శానిటరీ ప్యాడ్​ను తయారు చేయాలనుకున్నారు.

భారత ప్రభుత్వ అంకుర సంస్థల యోజన ప్రోత్సాహంతో అగ్రీ బిజినెస్(వ్యవసాయ ఆధారిత వ్యాపారం)​ ఆలోచనకు పదును పెట్టారు. ఇంకేముంది కొద్ది రోజుల్లోనే పొలంలోని చెత్తలో నిక్షిప్తమై ఉన్న సెల్యులోజ్​తో శానిటరీ నాప్కిన్​ను తయారు చేసి చూపించారు. ఇందుకు వారికి రూ.5 లక్షల దాకా ప్రోత్సాహకం లభించింది.

కేన్సర్​కు కారణమిదే

సాధారణంగా మహిళలు వాడే శానిటరీ ప్యాడ్​లు సర్వైకల్​ కేన్సర్​, యూటీఐ వ్యాధులకు ప్రధాన కారణంగా నిలుస్తోంది. ప్రపంచవ్యాప్తంగా గర్భాశయ కేన్సర్​తో మరణిస్తున్నవారిలో 1/4 వంతు భారతీయులే అంటే సమస్య ఎంత తీవ్రంగా ఉందో అర్థం చేసుకోవచ్చు. పైగా అవి భూమిపై కుప్పలు తెప్పలుగా చేరి పర్యావరణానికి హాని చేస్తున్నాయంటున్నారు నిపుణులు.

'పవిత్ర వర్క్​షాప్​లో మేము రుతుక్రమ ఆరోగ్యం, శుభ్రతపై శిక్షణ ఇస్తూంటాం. అప్పుడే నాకు అనిపించింది ఈ సమస్య చాలా పెద్దదని. మహిళలకు నెలసరి సమయంలో శుభ్రత విషయంలో అవగాహన లేదు. మరోవైపు ప్రస్తుతం వాడుతున్న శానిటరీ న్యాపికిన్​లలో భారీగా ప్లాస్టిక్, సింతెటిక్​​ వినియోగం జరుగుతోంది. అవి భూమిలో స్వతహాగా నాశనం కావు.'
- సుమిత పంజ్వాణీ, సామాజిక కార్యకర్త

పొరపాటు చేస్తున్నారు

ఇక రైతులు తమకు తెలియకుండానే వాయు కాలుష్యం సృష్టించి, భూసారాన్ని తగ్గిస్తున్నారని తెలిపారు సమిత.

'వరి పొట్టును, పొలంలో మిగిలిపోయిన గడ్డిని రైతులు కాల్చేస్తారు. ఈ కారణంగా వాయు కాలుష్యం వ్యాపిస్తోంది. పైగా భూమిలోని మంచి చేసే సూక్ష్మ క్రిములు కూడా చనిపోతాయి. కానీ రైతులు చెత్త నుంచి ఉపశమనం పొందడానికి వాటిని కాల్చేస్తున్నారు.'
- సుమిత పంజ్వాణీ, సామాజిక కార్యకర్త

ఇదీ చదవండి:పిల్లలు చెమట చుక్కలు చిందించట్లేదు

ABOUT THE AUTHOR

...view details