రిజర్వేషన్ల వ్యతిరేక మనస్తత్వాన్ని రాష్ట్రీయ స్వయంసేవక్ సంఘ్ (ఆర్ఎస్ఎస్) విడనాడాలని హితవు పలికారు బీఎస్పీ అధినేత్రి మాయావతి. రిజర్వేషన్లు రాజ్యాంగం కల్పించిన హక్కుగా తెలిపారు. వాటికి భంగం కలిగించటం అన్యాయం అని పేర్కొన్నారు.
రిజర్వేషన్లకు అనుకూలంగా ఉన్న వారికి, దానిని వ్యతిరేకించే వారికి మధ్య సామరస్యపూర్వక వాతావరణంలో చర్చ జరగాలని ఆర్ఎస్ఎస్ చీఫ్ మోహన్ భగవత్ పేర్కొన్నారు. ఆ మరుసటి రోజునే భగవత్ వ్యాఖ్యలను తప్పుపట్టారు మాయావతి. అలాంటి చర్చ ప్రమాదకర పరిస్థితులకు దారితీస్తుందన్నారు.
" ఎస్సీ, ఎస్టీ, బీసీలకు వర్తించే రిజర్వేషన్లపై సామరస్యపూర్వకంగా చర్చ జరగాలని ఆర్ఎస్ఎస్ పేర్కొంది. దాని ద్వారా విపత్కర పరిస్థితులు తలెత్తే అవకాశం ఉంది. అలాంటివి అవసరం లేదు. రిజర్వేషన్లు అనేది మానవత్వానికి సంబంధించినవి. రాజ్యాంగం కల్పించిన హక్కు. వాటికి భంగం కలిగించటం అన్యాయం, అక్రమం. ఆర్ఎస్ఎస్ రిజర్వేషన్ల వ్యతిరేక మనస్తత్వాన్ని విడనాడితే మంచిది."