తెలంగాణ

telangana

ETV Bharat / bharat

'గణేశుడి సైకత శిల్పం'తో ప్లాస్టిక్​పై యుద్ధం!

ప్రముఖ సైకత శిల్పకర్త సుదర్శన్​ పట్నాయక్​ ప్లాస్టిక్​పై అవగాహన కల్పించేందుకు గణేశ్​ చతుర్థిని వేదికగా చేసుకున్నారు. వినాయకుడి సైకత శిల్పం చుట్టూ 1000 ప్లాస్టిక్​ బాటిళ్లను ఏర్పాటు చేసి పర్యావరణ పరిరక్షణ ప్రాముఖ్యాన్ని ప్రజలకు తెలియజేశారు.

'గణేశుడి సైకత శిల్పం'తో ప్లాస్టిక్​పై అవగాహన

By

Published : Sep 2, 2019, 12:11 PM IST

Updated : Sep 29, 2019, 3:58 AM IST

'గణేశుడి సైకత శిల్పం'తో ప్లాస్టిక్​పై యుద్ధం!

ప్లాస్టిక్​ భూతంపై అవగాహన కల్పిస్తున్నారు ప్రముఖ సైకత శిల్పి సుదర్శన్​ పట్నాయక్​. దేశ ప్రజలకు ఈ సందేశం అందించేందుకు వినాయక చతుర్థిని వేదికగా చేసుకున్నారు. ఇందులో భాగంగా ఒడిశాలోని పూరి బీచ్​లో 5 టన్నుల ఇసుకతో.. 10 అడుగుల ఎత్తయిన వినాయకుడి సైకత శిల్పం రూపొందించారు పట్నాయక్​. దాని చుట్టూ 1000 ప్లాస్టిక్​ బాటిళ్లను ఏర్పాటు చేశారు.

ఈ ఇసుక ఏకదంతుడి విగ్రహం ద్వారా ఒక్కసారి మాత్రమే వినియోగించే ప్లాస్టిక్​ను నిషేధించాలని సందేశం ఇచ్చారు సుదర్శన్​. ' సే నో సింగిల్​ యూజ్​ ప్లాస్టిక్​', ' సేవ్​ అవర్​ ఎన్విరాన్​మెంట్​' అనే నినాదాలను ఇసుకపై రాశారు. ప్లాస్టిక్​ వల్ల కలిగే అనర్థాలను ప్రజలకు వివరించేందుకు తాను ఈ చిన్న ప్రయత్నం చేశానని పేర్కొన్నారు పట్నాయక్​.

" ఈ ఏడాది గణేశ్​ చతుర్థి సందర్భంగా ఒక్కసారి మాత్రమే వాడి పడేసే ప్లాస్టిక్​ను తిరస్కరించాలని సందేశం ఇవ్వాలనుకున్నాను. ఇటీవలే మన ప్రధానమంత్రి నరేంద్ర మోదీ అక్టోబర్​ 2 నుంచి ఒకసారి వాడి పడేసే ప్లాస్టిక్​ను నిషేధిస్తున్నట్లు చెప్పారు. ఈ కార్యక్రమంపై ప్రజల్లో అవగాహన కల్పించేందుకు 1000 ప్లాస్టిక్​ బాటిళ్లతో సైకత శిల్పం తయారు చేశాను. పర్యావరణాన్ని కాపాడాలని ఈ సందర్భంగా కోరుతున్నా. "
- సుదర్శన్​ పట్నాయక్​, సైకత శిల్పి.

ప్రపంచ వ్యాప్తంగా ప్లాస్టిక్​తో ఇబ్బందులు ఎదురవుతున్నాయని తెలిపారు పట్నాయక్​. ఇటీవల సముద్రాల్లో ప్లాస్టిక్​ కాలుష్యంతో భూమి ఎలా నాశనమవుతుందో తెలిపేలా చేసిన సైకత శిల్పానికి అమెరికాలో పీపుల్స్​ ఛాయిస్​ అవార్డు గెలుచుకున్నట్లు గుర్తు చేసుకున్నారు. అదే తరహాలో గణేశ్​ చతుర్థికి సందేశం ఇవ్వాలనుకున్నట్లు చెప్పారు.

ఇదీ చూడండి: గోల్డెన్​ గణేశ్​... దేశంలోనే అత్యంత సంపన్నుడు!

Last Updated : Sep 29, 2019, 3:58 AM IST

ABOUT THE AUTHOR

...view details