ఆర్టికల్ 370 రద్దు తర్వాత జమ్ము కశ్మీర్‌లో స్థానిక నాయకులపై విధించిన ఆంక్షలను సడలించింది ప్రభుత్వం. స్థానిక సంస్థలైన బ్లాక్ అభివృద్ధి మండలి (బీడీసీ) ఎన్నికల దృష్ట్యా వారిని విడుదల చేసే నిర్ణయం తీసుకున్నట్లు ప్రభుత్వ ఉన్నతాధికారులు తెలిపారు.
ఇప్పటివరకూ విడుదలైన వారిలో దేవేంద్రసింగ్ రానా(ఎన్సీ), హర్ష్‌దేవ్ సింగ్ (ఎన్‌పీపీ), రామన్ భల్లా(కాంగ్రెస్) తదితరులు ఉన్నారు.
మాజీ ముఖ్యమంత్రులైన మెహబూబా ముఫ్తీ, ఓమర్ అబ్దుల్లా, ఫరూక్ అబ్దుల్లా సహా ఇతర అగ్రనేతలు ఆగస్టు 5 నుంచి గృహ నిర్బంధంలో ఉన్నారు.