దేశంలోని ప్రతి నిరుపేద, మధ్య తరగతి కుటుంబానికి ఇల్లు ఉండాలనే లక్ష్యంతో కేంద్ర ప్రభుత్వం ఎంతో ప్రతిష్టాత్మకంగా ప్రారంభించిన పథకం ప్రధానమంత్రి ఆవాస్ యోజన- అర్బన్ (పీఎంఏవై-యూ). ఈ పథకం కింద ఇప్పటి వరకు కోటి ఇళ్లను మంజూరు చేసినట్లు ట్విట్టర్లో తెలిపారు కేంద్ర పట్టణ వ్యవహారాల మంత్రి హర్దీప్ సింగ్ పురి. దీనిపై ప్రధాని నరేంద్ర మోదీ స్పందించారు. ఇది 'పట్టణంలో నివసించే పేదలు, మధ్య తరగతి ప్రజల విజయం' అని ట్వీట్ చేశారు.
"ఈ రోజు 50వ సీఎస్ఎంసీ సమావేశం అనంతరం పీఎంఏవై-యూ పథకం కింద కోటి ఇళ్లు మంజూరు చేశామని ప్రకటిస్తున్నందుకు చాలా ఆనందంగా ఉంది. 2022 నాటికి అందరికి ఇల్లు ఉండాలనేదే ఈ పథకం ప్రధాన లక్ష్యం."
-హర్దీప్ సింగ్ పురి ట్వీట్.