స్వలింగ వివాహాలను భారతీయ చట్టాలు, సమాజ విలువలు అంగీకరించవని దిల్లీ హైకోర్టుకు కేంద్రం స్పష్టం చేసింది. హిందూ వివాహ చట్టం కింద స్వలింగ వివాహాలకు.. ప్రత్యేక వివాహ చట్టం కింద చట్టబద్దత కల్పించాలంటూ దాఖలైన పిటిషన్‌పై దిల్లీ హైకోర్టు విచారణ చేపట్టింది. ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ డీఎన్ పటేల్, జస్టిస్ ప్రతిక్ జలన్ నేతృత్వంలో ఏర్పాటైన ద్విసభ్య ధర్మాసనం ఎదుట భారత సొలిసిటర్ జనరల్ తుషార్ మెహతా పలు అంశాలను లేవనెత్తారు.
స్వలింగ వివాహాలపై కేంద్రం కీలక వ్యాఖ్యలు - స్వలింగ వివాహాలపై కేంద్రం వివరణ
భారతీయ చట్టాలు, సమాజ విలువలు.. స్వలింగ వివాహాలను ఏ మాత్రం అంగీకరించవని కేంద్రం దిల్లీ హైకోర్టుకు తెలిపింది. హిందూ వివాహ చట్టం కింద స్వలింగ వివాహాలకు.. ప్రత్యేక వివాహ చట్టం కింద చట్టబద్దత కల్పించాలంటూ దాఖలైన పిటిషన్‌పై ఈమేరకు వివరణనిచ్చింది కేంద్రం.
స్వలింగ వివాహాల చట్టబద్దతపై కేంద్రం వివరణ
హిందూ వివాహ చట్టం భార్యాభర్తలకు సంబంధించిన నిబంధనలు, వివాహేతర సంబంధాల గురించి మాత్రమే ప్రస్తావించిదన్న మెహతా..... స్వలింగ వివాహాలను వీటి పరిధిలోకి తేవటం సాధ్యం కాదని వివరించారు. ఈ తరహా వివాహాలకు అనుమతిస్తే అది పలు చట్ట నిబంధనలకు విరుద్ధమవుతుందని అభిప్రాయపడ్డారు.
ఈ కేసుపై తదుపరి విచారణను దిల్లీ హైకోర్టు అక్టోబర్ 21కి వాయిదా వేసింది.
TAGGED:
Same sex marriages