తెలంగాణ

telangana

ETV Bharat / bharat

ఒడిశా: భాజపా అభ్యర్థి నోట తెలుగు పాట - sambit patra

భాజపా జాతీయ అధికార ప్రతినిధి సంబిత్ పాత్రా వినూత్నంగా ప్రచారం చేశారు. ఒడిశాలోని పూరీలో తెలుగు ప్రజలు ఎక్కువ. వారిని ఆకట్టుకునేందుకు తెలుగు పాట పాడారు పాత్రా.

ఒడిశా అభ్యర్థి నోట తెలుగు పాట

By

Published : Apr 21, 2019, 6:27 AM IST

Updated : Apr 21, 2019, 9:11 AM IST

ఒడిశా అభ్యర్థి నోట తెలుగు పాట

కాదేదీ ప్రచారానికి అనర్హం అన్న రీతిలో నేతలు ఎన్నికల ప్రచారం కోసం వినూత్న పద్ధతులను అవలంబిస్తున్నారు. ప్రజలను ఆకర్షించేందుకు స్థానికత, వర్గాలను దృష్టిలో పెట్టుకుని ప్రచారం సాగిస్తున్నారు. భాజపా జాతీయ అధికార ప్రతినిధి సంబిత్​ పాత్ర కూడా ఇదే మార్గాన్ని అనుసరించారు.

పూరీలో తెలుగు ఓటర్లు ఎక్కువ. వారిని ఆకట్టుకునే ప్రయత్నంలో భాగంగా తెలుగు చలనచిత్రంలోని ఓ ప్రముఖ గీతాన్ని ఆలపించారు స్థానిక భాజపా అభ్యర్థి సంబిత్​. టాలీవుడ్ కథానాయకుడు నాగార్జున నటించిన 1995 నాటి 'క్రిమినల్' చిత్రంలోని 'తెలుసా...మనసా' గీతాన్ని ఆలపించారు.

Last Updated : Apr 21, 2019, 9:11 AM IST

ABOUT THE AUTHOR

...view details