తెలంగాణ

telangana

ETV Bharat / bharat

మిమల్ని చూసి నేను గర్విస్తున్నాను: మోదీ - స్వచ్ఛత

ఆరోగ్యం.. స్వచ్ఛత కోసం శ్రమిస్తున్న పౌరులు, సంస్థలను చూసి తాను గర్విస్తున్నట్లు ప్రధాని నరేంద్ర మోదీ తెలిపారు. ప్రపంచ ఆరోగ్య దినోత్సవం సందర్భంగా వారికి ట్విట్టర్​ ద్వారా శుభాకాంక్షలు తెలిపారు మోదీ.

మోదీ

By

Published : Apr 7, 2019, 11:19 PM IST

Updated : Apr 8, 2019, 12:10 AM IST

ప్రపంచ ఆరోగ్య దినోత్సవం సందర్భంగా ప్రధాని మోదీ ట్వీట్​

పరిశుభ్రత కోసం తమ వంతు సహాయం అందిస్తున్న ప్రతి ఒక్కరికి ప్రపంచ ఆరోగ్య దినోత్సవం సందర్భంగా ప్రధాని నరేంద్రమోదీ శుభాకాంక్షలు తెలిపారు. ప్రతి ఒక్కరు ఆరోగ్యంగా ఉండాలని ఆకాంక్షిస్తూ ట్విట్టర్​లో పోస్ట్​ చేశారు.

"ఆరోగ్యరక్షణ అభివృద్ధికి పని చేస్తున్న అన్ని సంస్థలకు, వ్యక్తులకు అభినందనలు. మెరుగైన ఆరోగ్యం కోసం పరిశుభ్రత, పారిశుద్ధ్య సౌకర్యాలను మెరుగు పరుస్తున్న వారందరిని చూసి నేను గర్విస్తున్నాను "
-మోదీ ట్వీట్​

ఆరోగ్యవంతమైన సమాజ నిర్మాణానికి కట్టుబడి ఉన్నట్లు పునరుద్ఘాటించారు మోదీ. ఆయుష్మాన్​ భారత్​ లాంటి అతి పెద్ద ఆరోగ్య కార్యక్రమం.. ప్రతి ఒక్క భారతీయునికి గర్వకారణమని తెలిపారు. దీని ద్వారా 50 కోట్ల మందికి నాణ్యమైన ఆరోగ్య సేవలు అందుతున్నాయని ఆయన పేర్కొన్నారు.

Last Updated : Apr 8, 2019, 12:10 AM IST

ABOUT THE AUTHOR

...view details