విదేశాంగ మాజీ మంత్రి సల్మాన్ ఖుర్షీద్, న్యాయవాది ప్రశాంత్ భూషణ్‌లకు దిల్లీ అల్లర్లతో సంబంధాలున్నట్లు పోలీసులు తెలిపారు. ఈ మేరకు దిల్లీ అల్లర్లకు సంబంధించి పోలీసులు దాఖలు చేసిన అభియోగపత్రంలో వారి పేర్లను నమోదు చేసినట్లు పేర్కొన్నారు. ఖుర్షీద్, ప్రశాంత్‌లతో సహా పలువురు నేతలు, కార్యకర్తల పేర్లు కూడా నమోదు చేసినట్లు అధికారులు తెలిపారు.
దిల్లీ అల్లర్ల కుట్రలో మరో ఇద్దరు ప్రముఖుల పేర్లు! - దిల్లీ అల్లర్లు
దిల్లీ అల్లర్లకు సంబంధించి పోలీసులు దాఖలు చేసిన అభియోగపత్రంలో కాంగ్రెస్ సీనియర్ నేత సల్మాన్ ఖుర్షీద్, న్యాయవాది ప్రశాంత్ భూషణ్ పేర్లు కూడా నమోదు చేసినట్లు అధికారులు తెలిపారు. వీరితో పాటు పలువురు నాయకులు, కార్యకర్తలను కుట్రదారులుగా పేర్కొన్నారు.
దిల్లీ అల్లర్ల కుట్రలో మరో ఇద్దరు ప్రముఖుల పేర్లు!
దిల్లీలో ఫిబ్రవరిలో జరిగిన అల్లర్లకు సంబంధించి ఈ నెల 16న అభియోగపత్రం దాఖలు చేశారు పోలీసులు. అల్లర్ల వెనుక భారీ కుట్ర జరిగినట్లు అందులో పేర్కొన్నారు. ఈ అల్లర్లలో సుమారు 53 మంది మరణించగా, 200 మందికి పైగా గాయపడ్డారు.
ఇదీ చూడండి:దిల్లీ అల్లర్ల వెనుక భారీ కుట్ర