తెలంగాణ

telangana

ETV Bharat / bharat

శశికళకు షాక్​- రూ.2000 కోట్ల ఆస్తులు జప్తు - శశికళ అక్రమాస్తులు

తమిళనాడు మాజీ ముఖ్యమంత్రి జయలలిత స్నేహితురాలు శశికళకు చెందిన రూ. 2000కోట్లు విలువైన ఆస్తులను అటాచ్​ చేసింది ఐటీ శాఖ. రానున్న అసెంబ్లీ ఎన్నికల్లో సీఎం అభ్యర్థిగా పళనిస్వామిని అన్నాడీఎంకే ప్రకటించిన రోజునే ఐటీశాఖ ఈ చర్యలు చేపట్టడం గమనార్హం.

Saiskala and Co's assets worth of RS.2,000 Cr attached by IT department
'చిన్నమ్మ' ఆస్తులపై ఐటీశాఖ చర్యలు

By

Published : Oct 7, 2020, 5:57 PM IST

అక్రమస్తుల కేసులో శిక్ష అనుభవిస్తున్న తమిళనాడు మాజీ ముఖ్యమంత్రి జయలలిత స్నేహితురాలు శశికళకు మరో షాక్​ తగిలింది. కొడనాడ్​, శిరుథవుర్​లో ఉన్న రూ. 2వేల కోట్లు విలువైన ఆస్తులను.. ఆదాయపు పన్నుశాఖ బుధవారం అటాచ్​ చేసింది.

రాష్ట్ర అసెంబ్లీకి వచ్చే ఏడాది జరగనున్న ఎన్నికల్లో పళనిస్వామిని సీఎం అభ్యర్థిగా అన్నాడీఎంకే ప్రకటించిన కొద్ది గంటలకే ఐటీశాఖ ఈ చర్యలు చేపట్టడం గమనార్హం.

2017లో శశికళకు సంబంధించిన దాదాపు 150 ప్రాంతాల్లో ఐటీశాఖ రైడ్లతో విరుచుకుపడింది. అప్పటి నుంచి శశికళ, ఆమె సన్నిహితులపై అక్రమాస్తుల కేసులో భాగంగా ఆస్తులను అటాచ్​ చేస్తూ వస్తోంది.

శశికళ ప్రస్తుతం కర్ణాటకలోని జైలులో శిక్ష అనుభవిస్తున్నారు.

ఇదీ చూడండి:-జనవరిలో చిన్నమ్మ రిలీజ్​- అన్నాడీఎంకేలో గుబులు!

ABOUT THE AUTHOR

...view details