తెలంగాణ

telangana

చరిత్రలో మొదటిసారి మూతపడనున్న శిరిడీ

By

Published : Jan 18, 2020, 7:30 AM IST

Updated : Jan 18, 2020, 3:07 PM IST

సాయి జన్మభూమి వివాదంపై శిరిడీ వాసులు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. పాథ్రీ ప్రచారంపై ఆందోళనకు దిగారు. రేపటి నుంచి శిరిడీ వ్యాప్తంగా బంద్​ నిర్వహించాలని నిర్ణయించారు. శిరిడీలోని సాయినాథుని ఆలయం మాత్రం తెరిచే ఉంటుందని తెలిపారు.

Sai Baba birth Place dispute
Sai Baba birth Place dispute

సాయి జన్మభూమిపై రాజకీయ వివాదం మరింత ముదురుతోంది. మహారాష్ట్ర పర్బనీ జిల్లా పాథ్రీ.. సాయి జన్మస్థానమని వస్తున్న వాదనలు.. రాజకీయ వివాదానికి దారి తీస్తోంది. పాథ్రీ అభివృద్ధి కోసం మహారాష్ట్ర సీఎం ఉద్ధవ్​ ఠాక్రే 100 కోట్లు విడుదల చేశారు.

ఈ నేపథ్యంలో సాయి కర్మభూమిగా భావించే శిరిడీలో ఆందోళనలు మొదలయ్యాయి. పాథ్రీ అభివృద్ధిని తాము వ్యతిరేకించట్లేదని.. తమ బాధ అంతా సాయి జన్మభూమిగా ప్రచారం చేయటమేనని శిరిడీ వాసులు చెబుతున్నారు.

సమ్మె బాట..

ఈ ప్రచారాన్ని నిరసిస్తూ శిరిడీలో ఆదివారం నుంచి సమ్మె చేపట్టాలని స్థానికులు నిర్ణయించారు. చరిత్రలో మొదటిసారి శిరిడీ మూతపడనుంది. అయితే ఆలయాన్ని మాత్రం మూసివేయమని ఆందోళనకారులు తెలిపారు.

శిరిడీకి నిత్యం వేలాది మంది సందర్శకులు వస్తుంటారు. ఈ నిర్ణయంతో భక్తులు, పర్యటకులపై భారీ ప్రభావం పడనుంది. ఈ నేపథ్యంలోనే భక్తులకు ఎలాంటి ఇబ్బంది కలగకూడదని రెండు రోజుల ముందుగా ప్రకటన చేసినట్లు ఆందోళనకారులు తెలిపారు.

ఇదీ చూడండి: రాజకీయ వివాదంగా 'సాయి జన్మభూమి'

Last Updated : Jan 18, 2020, 3:07 PM IST

ABOUT THE AUTHOR

...view details