ముంబయి ఉగ్రదాడిలో అమరుడైన హేమంత్ కర్కరేపై వివాదాస్పద వ్యాఖ్యలు చేసినందుకు క్షమాపణలు చెప్పారు భోపాల్ లోక్సభ భాజపా అభ్యర్థి సాధ్వి ప్రజ్ఞ సింగ్ ఠాకుర్. తన వ్యాఖ్యలను వెనక్కి తీసుకుంటున్నట్లు ప్రకటించారు. శత్రువులకు అవకాశం ఇవ్వొద్దనే ఈ నిర్ణయం తీసుకుంటున్నట్లు వివరణ ఇచ్చారు.
"శత్రువులకు మనోబలాన్ని ఇవ్వకూడదనే ఈ నిర్ణయం తీసుకున్నా. ఇది దేశ అంతర్గత విషయం. నా వ్యక్తిగత వ్యధ.. అందుకే నా వ్యాఖ్యలను వెనక్కి తీసుకుంటున్నా. క్షమాపణలు చెబుతున్నా. శత్రుదేశం నుంచి వచ్చిన ఉగ్రవాదుల తూటాలకు మన అధికారి ప్రాణాలు విడిచారు. ఆయన కచ్చితంగా అమరుడే."
-సాధ్వి ప్రజ్ఞ సింగ్ ఠాకూర్
మోదీ క్షమాపణకు కాంగ్రెస్ డిమాండ్..
సాధ్వీ వ్యాఖ్యలపై తీవ్రంగా మండిపడ్డాయి విపక్షాలు. ఈ అంశంలో ప్రధాని మోదీ భారత ప్రజలకు క్షమాపణలు చెప్పాలని డిమాండ్ చేసింది కాంగ్రెస్.