తెలంగాణ

telangana

ETV Bharat / bharat

వీడిన మిస్టరీ: మహారాష్ట్రలో మర్డర్​- తెలంగాణలో అరెస్ట్​ - Sainath Lingade

మహారాష్ట్ర నాందేడ్​లో శివాచార్య నిర్నయ్ రుద్రప్రతాప్ మహారాజ్​ అనే సాధువును హత్యచేసిన వ్యక్తి తెలంగాణలో పట్టుబడ్డాడు. నిందితుడు మరోవ్యక్తిని కూడా హత్యచేసినట్లు పోలీసులు గుర్తించారు. అతని నుంచి రూ.70 వేలు, ఓ ల్యాప్​టాప్ స్వాధీనం చేసుకున్నారు. దోపిడీ చేయడమే నిందితుడి ఉద్దేశమై ఉంటుందని పోలీసులు అనుమానిస్తున్నారు.

Sadhu, man killed in Nanded, accused held near T'gana border
మహారాష్ట్రలో మర్డర్... తెలంగాణలో అరెస్టు

By

Published : May 24, 2020, 5:50 PM IST

మహారాష్ట్ర నాందేడ్​ జిల్లాలో ఓ సాధువును, మరొకరిని హత్య చేసిన నిందితుడు సాయినాథ్ లింగాడే అనే వ్యక్తిని తెలంగాణలోని నిర్మల్ జిల్లా తనూరులో పోలీసులు అరెస్టు చేశారు. నిందితుడిపై 10 ఏళ్ల క్రితమే ఓ హత్య కేసు నమోదై ఉన్నట్లు పోలీసులు గుర్తించారు.

పోలీసు సూపరింటెండెంట్ విజయ్​కుమార్ మాగర్ వివరాలు వెల్లడించారు.

"మహారాష్ట్ర ఉమ్రీ పోలీసు స్టేషన్​ పరిధిలోని నాగ్తానాలో ఇవాళ ఉదయం 4 గంటలకు... 33 ఏళ్ల శివాచార్య నిర్నయ్ రుద్రప్రతాప్ మహారాజ్​ అనే సాధువు, 50 ఏళ్ల భగవాన్ షిండే అనే వ్యక్తి హత్యకు గురయ్యారు.

ఘటనా స్థలంలో సాయినాథ్ లింగాడే

సాయినాథ్ లింగాడే... భవవాన్ షిండే ఇద్దరూ చిన్చాల గ్రామానికి చెందినవారే. నిందితుడు సాయినాథ్​ ఊళ్లోని జిల్లా పరిషత్​ పాఠశాల వద్ద భగవాన్​ను హత్య చేసి... మృతదేహాన్ని బాత్​రూమ్​లో దాచాడు. తరువాత అక్కడకు సమీపంలోని (750 మీటర్ల) ఆశ్రమానికి వెళ్లి సాధువును కూడా చంపేశాడు. సాధువు మృతదేహాన్ని కారులో ఉంచి పారిపోవాలని ప్రయత్నించాడు. అయితే కారు.. ఆశ్రమం గేటుకు గుద్దుకోవడం వల్ల చుట్టు పక్కలవారు మేల్కొన్నారు. దీనితో నిందితుడు ద్విచక్రవాహనంపై అక్కడ నుంచి పారిపోయాడు." - పోలీసులు

సాయినాథ్ లింగాడే, నిందితుడు

దోపిడీయే అతని ఉద్దేశమా?

దోపిడీ చేయడమే నిందితుడి ప్రధాన ఉద్దేశమై ఉండొచ్చని పోలీసులు అనుమానిస్తున్నారు. నిందితుడ్ని అరెస్టు చేసిన పోలీసులు అతని నుంచి రూ.70,000, ఓ ల్యాప్​టాప్ స్వాధీనం చేసుకున్నారు.

పోలీసుల అదుపులో సాయినాథ్ లింగాడే

చాలా బాధాకరం

సాధువు శివాచార్య నిర్నయ్ రుద్రప్రతాప్ మహారాజ్​ హత్యపై మహారాష్ట్ర మాజీ ముఖ్యమంత్రి దేవేంద్ర ఫడణవీస్ దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు. నిందితుడ్ని పట్టుకుని కఠినంగా శిక్షించాలని ప్రభుత్వానికి విజ్ఞప్తి చేశారు.

'సాధువు శివాచార్య నిర్నయ్ రుద్రప్రతాప్ మహారాజ్​ హత్య చాలా బాధాకరం, ఇది నన్ను తీవ్ర దిగ్భ్రాంతికి గురిచేసింది.'

- దేవేంద్ర ఫడణవీస్, మహారాష్ట్ర మాజీ ముఖ్యమంత్రి ట్వీట్

ఇదీ చూడండి:లాక్​డౌన్​ అకస్మాత్తుగా విధించి తప్పుచేశారు: ఠాక్రే

ABOUT THE AUTHOR

...view details