దేశంలో అత్యవసర పరిస్థితి విధించి నేటితో 45 ఏళ్లు పూర్తయిన నేపథ్యంలో కీలక వ్యాఖ్యలు చేశారు ప్రధానమంత్రి నరేంద్ర మోదీ. ఎమర్జెన్సీ సమయంలో ప్రజాస్వామ్యం కోసం పోరాటం చేసిన వారి త్యాగాలు మరవలేమని పేర్కొన్నారు.
" దేశంలో అత్యవసర పరిస్థితి విధించి నేటికి సరిగ్గా 45 ఏళ్లు పూర్తయ్యాయి. భారత ప్రజాస్వామ్యాన్ని రక్షించేందుకు పోరాటం చేసి బాధలను అనుభవించిన ప్రజలకు నా సెల్యూట్. వారి త్యాగాలను దేశం ఎన్నటికీ మరవదు."