తెలంగాణ

telangana

ETV Bharat / bharat

అయోధ్య కేసు నుంచి న్యాయవాది ధావన్​ తొలగింపు - Muslim parties lawyer Rajeev Dhavan

అయోధ్య కేసు నుంచి సీనియర్​ న్యాయవాది రాజీవ్ ధావన్​ను తప్పించారు ముస్లిం కక్షిదారులు. ఈ నిర్ణయాన్ని రాజీవ్​ ధావన్​ కూడా అంగీకరించారు. ఇకపై తనకు ఈ కేసుతో ఎలాంటి సంబంధం లేదని ఈ సీనియర్ న్యాయవాది స్పష్టం చేశారు. అయితే అనారోగ్యం వల్లనే తనను తొలగిస్తున్నట్లు చెప్పడాన్ని ధావన్​ తప్పుబట్టారు.

Sacked from Ayodhya case, says Muslim parties' lawyer Rajeev Dhavan
అయోధ్య కేసు నుంచి న్యాయవాది ధావన్​ తొలగింపు

By

Published : Dec 3, 2019, 3:24 PM IST

సుప్రీంకోర్టు సీనియర్ న్యాయవాది రాజీవ్​ ధావన్​ను అయోధ్య భూవివాదం కేసు నుంచి ముస్లిం కక్షిదారులు తొలగించారు. ధావన్​ అనారోగ్యంతో బాధపడుతున్నందునే ఈ నిర్ణయం తీసుకున్నట్లు వారు ప్రకటించారు.

ఇకపై ఎలాంటి సంబంధం లేదు..

ముస్లిం కక్షిదారుల నిర్ణయాన్ని అంగీకరించినట్లు రాజీవ్ ​ధావన్​ ఫేస్​బుక్ పోస్టు ద్వారా వెల్లడించారు.

"జమియాత్​కు ప్రాతినిధ్యం వహిస్తున్న(ఎడ్వకేట్ ఆన్​ రికార్డ్) ఎజాజ్​ మక్బూల్ నన్ను తొలగించారు. ఇందుకు అంగీకరించి నేను అధికారిక లేఖ పంపాను. ఇకపై అయోధ్య కేసు సమీక్షతో నాకు ఎలాంటి సంబంధంలేదు."- రాజీవ్​ ధావన్​, సీనియర్ న్యాయవాది

అందులో వాస్తవం లేదు..

అనారోగ్యం వల్లనే తనను తొలగించినట్లు ముస్లిం కక్షిదారులు పేర్కొనడం... పూర్తిగా అవాస్తవమని రాజీవ్​ తెలిపారు. ఒకవేళ అనారోగ్యంతో ఉంటే... ఇతర కేసుల విషయమై కోర్టుకు ఎలా హాజరవుతున్నానని ఆయన ఎదురు ప్రశ్నించారు.

విభజించాలనుకోవడం లేదు..

ముస్లిం పార్టీలను విభజించడం తనకు ఇష్టం లేదని రాజీవ్​ ధావన్​ పేర్కొన్నారు.

"అయోధ్య కేసు విషయంలో నేను ముస్లింపార్టీలన్నింటి తరపున వాదించాను. ఇప్పటికీ అదే కోరుకుంటున్నాను. ముస్లింపార్టీలు ముందుగా తమ విబేధాలను పరిష్కరించుకోవాలి."- రాజీవ్​ ధావన్​, సీనియర్ న్యాయవాది

పిటిషన్ వేసిన మరుసటి రోజే..

సుప్రీంకోర్టు 'అయోధ్య' తీర్పును సవాల్ చేస్తూ 'జమాత్​ ఉలేమా ఇ హింద్' అధినేత మౌలానా అర్షద్​ మదానీ సోమవారం సమీక్ష పిటిషన్ దాఖలు చేశారు. మరుసటిరోజే న్యాయవాది రాజీవ్​ ధావన్​ను తప్పిస్తూ నిర్ణయం తీసుకున్నారు.

ఇదీ చూడండి:'దిశ' కేసు దోషులకు శిక్షపై జయ అలా... హేమ ఇలా...

For All Latest Updates

ABOUT THE AUTHOR

...view details