కేరళలో మరోసారి కరోనా వైరస్ విజృంభణతో ఆ రాష్ట్ర ప్రభుత్వం కొత్త మార్గదర్శకాలు విడుదల చేసింది. శబరిమల అయ్యప్పస్వామి దర్శనానికి వచ్చే భక్తులు, ఆలయంలో పనిచేసే సిబ్బంది తప్పనిసరిగా ఆర్టీ-పీసీఆర్ పరీక్షలు చేయించుకొని రావాలని తెలిపింది.
శబరిమల దర్శనానికి ఆర్టీ-పీసీఆర్ తప్పనిసరి - Ayyappa darshan news guidelines
అయ్యప్ప దర్శనానికి వచ్చే భక్తులు, ఆలయంలో విధులు నిర్వహించే సిబ్బంది తప్పనిసరిగా ఆర్టీ-పీసీఆర్ టెస్ట్ చేయించుకొని రావాలని తెలిపింది కేరళ ప్రభుత్వం. ఆ ప్రాంతంలో కొవిడ్ కేసులు పెరుగుతున్న నేపథ్యంలో కొత్త మార్గదర్శకాలు విడుదల చేసింది.
డిసెంబర్ 26 తరువాత మండల దీక్ష పూర్తి చేసుకొని వచ్చే భక్తులు, ఆలయంలో పనిచేసే సిబ్బందికి ఆర్టీ-పీసీఆర్ పరీక్షలు తప్పనిసరి చేసింది. అయ్యప్పస్వామి ఆలయం ఉన్న పతనంతిట్ట జిల్లాలో కరోనా కేసులు 31 శాతానికి పెరిగాయని ఆ రాష్ట్ర ఆరోగ్యశాఖ మంత్రి కేకే శైలజ తెలిపారు. ఇప్పటి వరకు దర్శనానికి వచ్చిన 51 మంది, ఆలయంలో పనిచేసే 245 సిబ్బంది వైరస్‌బారిన పడినట్లు మంత్రి తెలిపారు. ఆలయానికి వచ్చే 24 గంటల ముందు కొవిడ్ నెగిటివ్ పరీక్షా ఫలితాన్ని తీసుకురావాలన్న మంత్రి.. ప్రతి ఒక్కరూ భౌతిక దూరాన్ని పాటించాలని సూచించారు.
ఇదీ చూడండి:శబరిమల యాత్రకు నూతన మార్గదర్శకాలివే!