కొవిడ్ నిబంధనల కారణంగా ఈ ఏడాది కేరళలోని శబరిమల ఆలయ ఆదాయం భారీగా తగ్గింది. ఆలయ దర్శనం ప్రారంభమై 39 రోజులు అవుతున్నా కేవలం రూ. 9.09 కోట్ల ఆదాయమే వచ్చింది. గతేడాది ఇదే సమయానికి ఆలయ ఆదాయం రూ. 156 కోట్లుగా ఉంది. ఇప్పటివరకు 71,706 మంది ఆలయ దర్శనానికి వచ్చారని ట్రావెన్కోర్ దేవస్థానం బోర్డు అధ్యక్షుడు ఎన్ వాసు మీడియా సమావేశంలో వెల్లడించారు.
" శబరిమల ఆలయ ఆదాయం చాలా మేరకు తగ్గింది. గతేడాదితో పోల్చితే ఈ ఏడాది 5 శాతం మంది కూడా ఆలయ దర్శనానికి రాలేదు. హైకోర్టు, ప్రభుత్వం ఆదేశాల మేరకు భక్తుల పరిమితిని దష్టిలో ఉంచుకుని ఆలయ దర్శనానికి అనుమతి ఇస్తున్నాం. మండల-మకరవిలక్కు పండగ సందర్భంగా ఆలయంలో అన్ని ఏర్పాట్లు చేశాం".