తెలంగాణ

telangana

ETV Bharat / bharat

నేడు తెరుచుకోనున్న శబరిమల ఆలయం - అయప్ప భక్తులు

పదిరోజుల వార్షికోత్సవం కోసం శబరిమల ఆలయం నేడు తెరుచుకోనుంది. మార్చ్​ 21 వరకు ఈ ఉత్సవం కొనసాగుతుందని ట్రావెన్​కోర్​ దేవస్థాన బోర్డు తెలిపింది.

నేడు తెరుచుకోనున్న శబరిమల ఆలయం

By

Published : Mar 11, 2019, 6:44 AM IST

Updated : Mar 11, 2019, 9:36 AM IST

నేడు తెరుచుకోనున్న శబరిమల ఆలయం
శబరిమల ఉత్సవానికి అయ్యప్ప ఆలయం మరోమారు తెరుచుకోనుంది. సాయంత్రం 5 గంటలకు ఆలయ ద్వారాలు తెరుస్తారు. నేటి నుంచి పదిరోజుల పాటు జరగనున్న ఈ వేడుకలకు అయ్యప్ప సన్నిధానం అంగరంగ వైభవంగా ముస్తాబయింది. మొదటగా స్వామివారికి ప్రధానార్చకులు పూజలు నిర్వహిస్తారు. అనంతరం తదుపరి కార్యక్రమాలు ఉంటాయని ఆలయ అధికారులు తెలిపారు. ఎలాంటి అవాంఛనీయ ఘటనలు జరగకుండా పటిష్ట భద్రతను ఏర్పాటు చేసినట్లు వెల్లడించారు.

బంగారు ద్వారం...

అయ్యప్ప గర్భగుడికి బంగారు పూతతో తయారుచేసిన ప్రత్యేక ద్వారాన్ని అమర్చనున్నారు. ప్రస్తుతమున్న ద్వారాలు దెబ్బతిన్నందున కొత్తవాటిని అమర్చుతున్నట్లు ట్రావెన్​కోర్​ దేవస్థాన బోర్డు తెలిపింది.

ఎలా జరుగుతుందో...

ఆలయంలోకి మహిళలను అనుమతిస్తూ సుప్రీంకోర్టు తీర్పునిచ్చింది. అప్పటి నుంచి దేవస్థాన పరిసర ప్రాంతాల్లో ఉద్రిక్త పరిస్థితులు నెలకొన్నాయి. ఇటీవల ఇద్దరు యువతులు అయ్యప్పను దర్శించుకున్నందుకు పెద్ద ఎత్తున నిరసనలు చెలరేగాయి. ఇలాంటి పరిస్థితుల మధ్య వార్షిక పండుగ ఎలా జరగనుందోనని సర్వత్రా ఉత్కంఠ నెలకొంది.

Last Updated : Mar 11, 2019, 9:36 AM IST

ABOUT THE AUTHOR

...view details