తెలంగాణ

telangana

ETV Bharat / bharat

స్వామియే శరణం... ఆలయ ఆదాయం 100కోట్లు! - నెల రోజులకే రూ.100 కోట్లు దాటిన అయ్యప్ప ఖజానా!

ఈ మండల మాసంలో శబరిమల ఆలయ ఆదాయం వంద కోట్లు దాటింది. కేవలం హుండీ ద్వారా 35 కోట్ల రూపాయలకుపైగా కానుకలు వచ్చాయి. మరో నెల రోజుల్లో రికార్డు స్థాయిలో ఆదాయం వస్తుందని దేవస్థాన బోర్డు ఆశాభావం వ్యక్తం చేస్తోంది.

Sabarimala Revenue collection crosses 100 crores in just 1 month
నెల రోజులకే రూ.100 కోట్లు దాటిన అయ్యప్ప ఖజానా!

By

Published : Dec 14, 2019, 7:41 PM IST

కోరిన కోర్కెలు తీర్చే ఆ శబరీశుడి మందిరానికి ఏటా భక్తులు బారులు తీరుతారు. లక్షలాది మంది శబరిమలకు తరలి వెళ్లి అయప్పకు ముడుపులు, కానుకలు చెల్లించుకుంటారు. ఫలితంగా ఈసారి మండల దర్శనాలు ప్రారంభమైన నెల రోజుల్లోనే అయ్యప్ప ఖజనాలో 100 కోట్ల రూపాయలు వచ్చి చేరాయి.

గత ఏడాదితో పోలిస్తే ఈసారి 40 కోట్ల రూపాయల ఆదాయం పెరిగింది. ఆలయంలోకి మహిళల ప్రవేశాన్ని అనుమతిస్తూ సుప్రీంకోర్టు తీర్పునివ్వడం వల్ల చెలరేగిన ఆందోళనలు... 2018లో స్వామి ఆదాయంపై ప్రభావం చూపాయి.

ఈసారి కేవలం హుండీలోనే 35 కోట్ల రూపాయల దాకా సొమ్ము పోగయింది. 6 కోట్లకుపైగా నగదును ఇంకా లెక్కించాల్సి ఉంది. ఈసారి స్వామివారి మహా ప్రసాదం అరవణ, అప్పంల విక్రయాలపైనా ఆదాయం బాగానే వచ్చింది.

అయితే మరో నెల రోజులపాటు కొనసాగనున్న మండల మాసంలో వచ్చే ఆదాయం.. అన్ని రికార్డులను బద్దలకొడుతుందని దేవస్థాన బోర్డు అంచనా వేస్తోంది.

ఇదీ చదవండి:భరత నాట్య కళాకారిణి లీలా శాంసన్​పై సీబీఐ కేసు

ABOUT THE AUTHOR

...view details