తెలంగాణ

telangana

ETV Bharat / bharat

తమిళనాడు నుంచి జపాన్​కు 'నీటి' ఇంజిన్ - జపాన్​

ప్రపంచంలోనే తొలిసారిగా స్వేదజలం(డిస్టిల్డ్​ వాటర్​)తో నడిచే ఇంజిన్​ తయారు చేశారు తమిళనాడు కోయంబత్తూరుకు చెందిన మెకానికల్​ ఇంజినీర్​. దాదాపు 10 ఏళ్ల పాటు శ్రమించి ఈ ఇంజిన్​ను రూపకల్పన చేశారు.

తమిళనాడు నుంచి జపాన్​కు 'నీటి' ఇంజిన్

By

Published : May 11, 2019, 11:03 AM IST

తమిళనాడు నుంచి జపాన్​కు 'నీటి' ఇంజిన్

ఇప్పటి వరకు డీజిల్​, పెట్రోల్​, విద్యుత్​తో నడిచే వాహనాల ఇంజిన్లు మాత్రమే చూసుంటాం. కానీ... మూడింటితోనూ ఖర్చు అధికం, పర్యావరణానికి ప్రమాదం. భూమి మీద విరివిగా లభించే నీటితో నడిచే ఇంజిన్​ తయారు చేస్తే ఎలా ఉంటుంది..? భలే ఉంటుంది కదూ...! ఇప్పుడు ఇదే కలను నిజం చేశారు తమిళనాడు కోయంబత్తూర్​కు చెందిన ఎస్​ కుమారస్వామి.

మెకానికల్​ ఇంజినీరింగ్​లో పట్టభద్రులైన కుమారస్వామి దాదాపు 10 ఏళ్ల పాటు శ్రమించి ఈ యంత్రాన్ని రూపొందించారు. ప్రపంచంలో డిస్టిల్డ్​ నీటితో నడిచే మొదటి ఇంజిన్​గా ఈ యంత్రం రికార్డులకెక్కింది.

పూర్తిగా స్వేదజలంతో నడిచే ఈ ఇంజిన్​ హైడ్రోజన్​ను ఇంధనంగా వినియోగించుకుని ఆక్సిజన్​ను విడుదల చేస్తుందంటున్నారు రూపకర్త కుమారస్వామి. పర్యావరణ హితమైన ఈ ఆవిష్కరణపై జపాన్​కు చెందిన వాణిజ్య సంస్థ (జెట్రో) ఆసక్తి కనబరిచింది.

"ఈ ఇంజిన్​ను భారత్​లో పరిచయం చేయడం నా కల. ఈ విషయం గురించి తెలిసిన ప్రతి అధికారి తలుపు తట్టా. కానీ ఎవరి దగ్గర నుంచి సానుకూల స్పందన రాలేదు. అందుకే జపాన్​ ప్రభుత్వంతో చర్చించాను. అవకాశం దక్కింది. రాబోయే కాలంలో ఈ ఇంజిన్​ జపాన్​లో పరిచయమవుతుంది."
-ఎస్​. కుమారస్వామి, ఇంజిన్​ సృష్టికర్త

ABOUT THE AUTHOR

...view details