కేంద్రం ఇవాళ ప్రవేశపెట్టిన 2019-20 మధ్యంతర బడ్జెట్ ప్రకారం ప్రభుత్వానికి వచ్చే ప్రతి రూపాయిలో 70 పైసలు పన్నుల ద్వారా సమకూరనుంది. ఇందులో 21 పైసలతో వస్తు సేవల పన్ను(జీఎస్టీ) అతిపెద్ద ఆదాయ వనరుగా ఉండనుందని ఆర్థిక మంత్రి తన బడ్జెట్ ప్రసంగంలో తెలిపారు.
మిగతా వాటిలో కేంద్ర ఎక్సైజ్ సుంకం ద్వారా 7 పైసలు, ప్రభుత్వ ఆస్తుల ద్వారా 19 పైసలు, పెట్టుబడుల ఉపసంహరణ ద్వారా 8 పైసలు, మూలధన లాభాలు 3 పైసలుగా ఉండనున్నాయి. కార్పొరేట్ల సమీకరణ ఆదాయం 21 పైసలు, ఆదాయపు పన్ను 17 పైసలు కాగా....కస్టమ్స్ సుంకం ద్వారా 4 పైసలు ఆర్జించనుంది.