తెలంగాణ

telangana

By

Published : Sep 27, 2019, 12:54 PM IST

Updated : Oct 2, 2019, 5:04 AM IST

ETV Bharat / bharat

తల్లిదండ్రులకు పిండప్రదానం చేసిన రష్యా మహిళలు

భారతీయ సంస్కృతి, సంప్రదాయాలను చాలా మంది విదేశీయులు గౌరవిస్తారు. మరికొందరు ఆచరిస్తారు. రష్యాకు చెందిన ఆరుగురు మహిళలు ఆ  కోవకే చెందుతారు. బిహార్​ గయలో ఏటా జరిగే పితృతర్పణ మేళాకు హాజరై వారి తండ్రిదండ్రులకు పిండప్రదానం చేశారు.

రష్యా మహిళలు

తల్లిదండ్రులకు పిండప్రదానం చేసిన రష్యా మహిళలు

తమ తల్లిదండ్రుల ఆత్మకు శాంతి కలగాలని భారతీయ సంప్రదాయంలో పిండప్రదానం చేశారు కొంతమంది రష్యా మహిళలు. బిహార్​ గయలో మోక్షదాయినిగా భావించే ఫల్గు నది నీటితో తర్పణం చేశారు.

రష్యాకు చెందిన ఆరుగురు మహిళలు గయలోని విష్ణుపథం మందిరానికి వచ్చారు. మందిర ప్రాంగణంలో తల్లిదండ్రులకు హిందూ ఆచారం ప్రకారం పిండప్రదానం చేశారు. భారతీయ సంప్రదాయ దుస్తులు ధరించి ఈ ఘట్టాన్ని నిర్వహించారు.

"మా తండ్రిదండ్రులకు తర్పణం చేసేందుకు మేం ఇక్కడికి వచ్చాం. ఇక్కడికి రావటం చాలా ఆనందంగా ఉంది. ఇలాంటి కార్యక్రమాలకు గయ ప్రత్యేక పుణ్యక్షేత్రం."

-రూరోసి, రష్యా మహిళ

గయలో ఏటా జరిగే పితృతర్పణ మేళాకు దేశ విదేశాల నుంచి లక్షల మంది వస్తుంటారు. తల్లిదండ్రుల ఆత్మకు శాంతి కలగాలని భక్తిశ్రద్ధలతో పిండప్రదానం చేస్తుంటారు. ఈ కార్యక్రమం 3 రోజుల పాటు కొనసాగుతుంది.

ఇదీ చూడండి: ముఖకవళికలతో విద్యార్థుల మానసిక స్థితి అంచనా..!

Last Updated : Oct 2, 2019, 5:04 AM IST

ABOUT THE AUTHOR

...view details