రష్యా అభివృద్ధి చేసిన స్పుత్నిక్ వీ కొవిడ్ టీకాను 100 మంది భారతీయ వలంటీర్లపై ప్రయోగించనున్నట్లు డ్రగ్ కంట్రోల్ జనరల్ ఆఫ్ ఇండియా(డీసీజీఐ)తెలిపింది. ఈ మేరకు దిగ్గజ ఔషధ తయారీ సంస్థ డాక్టర్ రెడ్డీస్ లేబొరెటరీస్కు పరీక్షలు నిర్వహించే అనుమతులు ఇస్తున్నట్లు పేర్కొన్నారు.
ఎప్పుడు టెస్టులు నిర్వహించాలనే అంశంపై డాక్టర్ రెడ్డీస్ సంస్థ ఇంకా స్పష్టత ఇవ్వాల్సి ఉంది. అయితే ఫేస్-2 క్లినికల్ టెస్టుల నిర్వహణ జరిపాకే డా.రెడ్డీస్.. మూడో దశ ట్రయల్స్ నిర్వహిస్తుందని స్పుత్నిక్ అధికారికంగా ప్రకటించింది.
" 100 మంది భారతీయులపై స్పుత్నిక్ వీ రెండో దశ క్లినికల్ ట్రయల్స్ చేశాక మూడో దశలో దాదాపు 1400 మందిపై ప్రయోగాలు జరుపుతారు. రెండో ట్రయల్స్ అనంతరం వ్యాక్సిన్ సురక్షితమైందని దిగ్గజ ఔషధ తయారీ సంస్థ ఖరారు చేశాకే మూడో దశ ట్రయల్స్‌కు అనుమతి ఉంటుంది".
- ఓ ప్రభుత్వ అధికారి.