రాజస్థాన్‌లో శాసనసభ సమావేశాలకు పిలుపునివ్వాలన్న ముఖ్యమంత్రి అశోక్ గహ్లోత్ కేబినెట్ ప్రతిపాదనను మరోమారు తోసిపుచ్చారు గవర్నర్ కల్రాజ్ మిశ్రా. మరిన్ని ప్రశ్నలు సంధిస్తూ ఆ ప్రతిపాదనను వెనక్కి పంపించారు.
గహ్లోత్ ప్రతిపాదనను గవర్నర్ వెనక్కిపంపడం ఇది రెండోసారి. అంతకుముందు.. బలనిరూపణ కోసం శాసనసభను నిర్వహించాలన్న గహ్లోత్ అభ్యర్థనపై స్పష్టత కోరుతూ ఆరు ప్రశ్నలు అడిగారు మిశ్రా. వాటిపై సుదీర్ఘంగా చర్చించిన కేబినెట్.. పలు సవరణలతో మరో ప్రతిపాదనను పంపించింది. తాజాగా దాన్ని కూడా వెనక్కి పంపించేసారు మిశ్రా.
ఇదీ చూడండి:-రాజస్థాన్: బలనిరూపణకు కాదు, కరోనాపై చర్చకే!
వ్యాజ్యం ఉపసంహరణ..
మరోవైపు ఎమ్మెల్యేల అనర్హత వేటుపై రాజస్థాన్ హైకోర్టు ఈ నెల 21న ఇచ్చిన తీర్పునకు వ్యతిరేకంగా సుప్రీంకోర్టులో దాఖలు చేసిన వ్యాజ్యాన్ని స్పీకర్ ఎన్పీ జోషి ఉపసంహరించుకున్నారు. ఇందుకు అత్యున్నత న్యాయస్థానం అనుమతినిచ్చింది. ఈ నెల 24న హైకోర్టు మరోమారు ఆదేశాలిచ్చిందని.. దానిపై చట్టపరమైన అంశాలను పరిశీలిస్తున్నట్టు ప్రభుత్వం తరపున వాదనలు వినిపించిన న్యాయవాది కపిల్ సిబల్ పేర్కొన్నారు. అనర్హత వేటు వేయకూడదన్న హైకోర్టు తీర్పుపై సుప్రీంకోర్టు స్టే విధించకపోవడం వల్ల స్పీకర్ వ్యాజ్యం నిరుపయోగంగా మారిందన్నారు.
ఇదీ జరిగింది..
సచిన్‌పైలట్ రెబల్‌గా మారడం వల్ల రాజస్థాన్ రాజకీయాల్లో తీవ్ర కలకలం రేపింది. అనంతరం పైలట్‌ను డిప్యూటీ సీఎం, పీసీసీ చీఫ్ పదవులను నుంచి తప్పించింది కాంగ్రెస్. ఈ పరిణామాలతో ప్రభుత్వం సంక్షోభంలో పడింది. అయితే తమ వద్ద మెజారిటీ ఉందని.. తమ బలాన్ని నిరూపించుకునేందుకు శాసనసభ నిర్వహించాలని అశోక్ గహ్లోత్ ప్రభుత్వం గవర్నర్‌ను కోరుతోంది.
ఇవీ చూడండి:-