తెలంగాణ

telangana

ETV Bharat / bharat

ఆర్ఎస్​ఎస్​కు రాజకీయాలతో సంబంధం లేదు: భగవత్​

ఆర్ఎస్​ఎస్​​, భాజపా సంబంధాలపై వ్యాఖ్యానించారు ఆ సంస్థ చీఫ్​ మోహన్​ భగవత్. రాష్ట్రీయ స్వయం సేవక్​ సంఘ్​కు రాజకీయాలతో ఎలాంటి సంబంధం లేదన్నారు. దేశం సర్వతోముఖాభివృద్ధి చెందేలా కృషి చేస్తున్నామన్నారు.

mohan bhagwat
మోహన్ భగవత్, ఆరెస్సెస్ అధ్యక్షుడు

By

Published : Jan 18, 2020, 8:53 PM IST

రాష్ట్రీయ స్వయం సేవక్‌ సంఘ్‌ (ఆర్ఎస్​ఎస్​)​కు రాజకీయాలతో ఎలాంటి సంబంధం లేదని ఆ సంస్థ చీఫ్​ మోహన్‌ భగవత్‌ అన్నారు. దేశంలో నైతిక, సాంస్కృతిక, మానవ విలువలను పెంపొందించేందుకు మాత్రమే ఆర్ఎస్​ఎస్​ పనిచేస్తోందని తెలిపారు. ఉత్తర్​ప్రదేశ్‌లోని మొరాదాబాద్‌లో ఆర్ఎస్​ఎస్​ కార్యకర్తల నాలుగు రోజుల శిక్షణ ముగింపు కార్యక్రమంలో మోహన్‌ భగవత్‌ ప్రసంగించారు.

అన్ని వర్గాల ప్రజలుఆర్ఎస్​ఎస్​​లో భాగమన్నారు భగవత్. అందులో కొందరు రాజకీయ పార్టీలు నిర్వహిస్తున్నారని వ్యాఖ్యానించారు. ఎన్నికలతో తమకు సంబంధం లేదన్న భగవత్‌ 60 ఏళ్లుగా తాము దేశ విలువలను నిలబెట్టేందుకు నిర్విరామ కృషి చేస్తున్నామని ఉద్ఘాటించారు. భాజపా... ఆర్ఎస్​ఎస్​ రిమోట్‌ కంట్రోల్‌ అన్న ఆరోపణలను ఆయన ఖండించారు. భారత రాజ్యాంగానికి కట్టుబడి దేశానికి సేవ చేయాలనుకునే వారందరూ ఆర్ఎస్​ఎస్​​లో చేరవచ్చని మోహన్‌ భగవత్‌ పిలుపునిచ్చారు.

మోహన్ భగవత్, ఆరెస్సెస్ అధ్యక్షుడు

"మా పని మంచిది. మంచి పనులు చేయడాన్ని పెంచుతున్నాం. మాకు మరో ఎన్నికలు గెలిచేది ఏమీ లేదు. మేం ఎన్నికల కోసం చేసేది లేదు. దేశం కోసం మాత్రమే పనిచేస్తాం. చరిత్రలో మా పేరు లేకపోయినా ఫర్వాలేదు. అలాఆర్ఎస్​ఎస్​పనిచేస్తుంది. సిద్ధాంతాలకు అనుగుణంగా ఆర్ఎస్​ఎస్దేశవ్యాప్తంగా ఉన్న విభాగాల్లో మంచి పనులు చేపడుతుంది. ఇవి ఆయా విభాగాలు స్వతంత్రంగా చేపట్టే కార్యక్రమాలు అయి ఉంటాయి. పలుసార్లు పత్రికలు పేర్కొన్నట్లుగా రిమోట్ కంట్రోల్ ఏమీ ఉండదు."

-మోహన్ భగవత్,ఆర్ఎస్​ఎస్​​చీఫ్​

ఇదీ చూడండి: 'పౌర' చట్టంపై పోరాడేవారు ఎస్సీ వ్యతిరేకులు: ​షా

For All Latest Updates

TAGGED:

ABOUT THE AUTHOR

...view details