తెలంగాణ

telangana

ETV Bharat / bharat

'వివాదాలు వదిలి మందిర నిర్మాణంలో భాగం కావాలి!' - అయోధ్య కేసు తాజా వార్తలు

అయోధ్య తీర్పు వెలువడిన నేపథ్యంలో తమ స్పందన తెలిపారు రాష్ట్రీయ స్వయం సేవక్​ సంఘ్(ఆరెస్సెస్) అధినేత మోహన్ భగవత్. వివాదాన్ని ఎంత త్వరగా ముగిస్తే అంత మంచిదని భావించామని తెలిపారు. ఇక వివాదాలు మరచిపోయి రామ మందిర నిర్మాణంలో భాగం కావాలని ప్రజలకు పిలుపునిచ్చారు.

'వివాదాలు వదలి మందిర నిర్మాణంలో భాగం కావాలి!'

By

Published : Nov 9, 2019, 2:56 PM IST

అయోధ్య వివాదాన్ని ఎంత త్వరగా ముగిస్తే అంత మంచిదని భావించామని... ఇప్పుడు అందుకు అనుగుణంగానే సుప్రీం తీర్పు వెలువడిందని అన్నారు ఆరెస్సెస్‌ అధినేత మోహన్ భగవత్.

ఆరెస్సెస్‌ అంటే ఆందోళన కోసం ఉద్దేశించింది కాదని వ్యక్తిత్వ వికాసాన్ని పెంపొందించేందుకు ప్రయత్నిస్తుందని అన్నారు. ఈ తీర్పును ఒకరి గెలుపు మరొకరి ఓటమిగా భావించరాదని అన్నారు మోహన్ భగవత్‌.

'వివాదాలు వదలి మందిర నిర్మాణంలో భాగం కావాలి!'

"శ్రీరామ జన్మభూమికి సంబంధించిన అంశమై సుప్రీంకోర్టు ద్వారా ఈ దేశ ప్రజల విశ్వాసాలను కాపాడే విధంగా ఇచ్చిన తీర్పును రాష్ట్రీయ స్వయం సేవక్​ సంఘ్ స్వాగతిస్తోంది. దశాబ్దాలుగా కొనసాగిన సుదీర్ఘ న్యాయ ప్రక్రియ తర్వాత తుదితీర్పు వెలువడింది.

ఈ తీర్పును ఒకరి విజయం మరొకరి పరాజయంగా భావించరాదు. సత్యం న్యాయాన్ని మధిస్తే వచ్చిన ఫలితం ఇది. భారత సమాజంలో అంతర్లీనంగా ఉన్న ఐకమత్యాన్ని మరింత బలోపేతం చేసే నిర్ణయంగా దీన్ని భావించాలి, ఆ దిశగానే దీన్ని అమల్లోకి తీసుకురావాలి. దేశ చట్టాలు, రాజ్యాంగానికి లోబడి దేశ ప్రజలు తమ భావాలను వ్యక్తం చేయాలని కోరుతున్నాను. ఈ వివాదాన్ని పరిష్కరించడానికి సర్వోన్నత న్యాయస్థానం చేసిన సూచనను ప్రభుత్వం శీఘ్రంగా అమలు చేస్తుందని మేం భావిస్తున్నాం. గతంలో జరిగిన అన్ని విషయాలను మరిచిపోయి.. రామజన్మ భూమిలో మందిర నిర్మాణంలో అందరూ పాల్పంచుకోవాలని కోరుతున్నాం."

-మోహన్ భగవత్, ఆరెస్సెస్ అధినేత

ఇదీ చూడండి: 'దేశభక్తిని బలోపేతం చేయాల్సిన సమయం ఇది'

ABOUT THE AUTHOR

...view details