రాజ్యసభ నుంచి సస్పెండ్ అయి పోరు బాట పట్టిన ఎనిమిది మంది ఎంపీలకు టీ తీసుకెళ్లారు డిప్యూటీ ఛైర్మన్ హరివంశ్. అయితే హరివంశ్ అందించిన టీ'ని ఎంపీలు ఎవరూ స్వీకరించలేదు. ఎంపీలు సభలో వ్యవసాయ బిల్లుల ఆమోదంపై గందరగోళం సృష్టించారనే ఆరోపణలతో సమావేశాలు పూర్తయ్యేంత వరకు సస్పెన్షన్ వేటు వేశారు. దీంతో ఆ ఎంపీలు పోరుబాట పట్టారు. వారు రాత్రంతా పార్లమెంట్ ప్రాగణంలోని గాంధీ విగ్రహం వద్దే నిరసనలు చేశారు.
అయితే హరివంశ్.. తోటి సభ్యుడిగానే తమను కలిశారని.. అంతేకానీ రాజ్యసభ డిప్యూటీ ఛైర్మన్గా రాలేదన్నారు కాంగ్రెస్ ఎంపీ రిపున్ బోర. 'తమను సస్పెండ్ చేసినందుకు సోమవారం నుంచి నిరసనల ప్రదర్శిస్తున్నాం. రాత్రంతా ఇక్కడే గడిపాం. మా గురించి అడగడానికి ప్రభుత్వం నుంచి ఒక్కరు కూడా రాలేదు. కొంతమంది ప్రతిపక్షనేతలు మాకు సంఘీభావం తెలిపారు. మంగళవారం కూడా నిరసనలు కొనసాగిస్తాం' అని బోర చెప్పారు.