తెలంగాణ

telangana

ETV Bharat / bharat

ఒక్కరోజు దీక్ష విరమించిన రాజ్యసభ డిప్యూటీ ఛైర్మన్

రాజ్యసభలో విపక్ష సభ్యుల అనుచిత ప్రవర్తనను నిరసిస్తూ మంగళవారం ఉదయం నుంచి చేపట్టిన ఒక్కరోజు నిరహార దీక్షను విరమించారు డిప్యూటీ ఛైర్మన్ హరివంశ్ నారాయణ్​.

RS Deputy Chairman Harivansh breaks one-day fast
ఒక్కరోజు దీక్ష విరమించిన డిప్యూటీ ఛైర్మన్

By

Published : Sep 23, 2020, 9:09 AM IST

రాజ్యసభలో వ్యవసాయ బిల్లుల ఆమోదం సందర్భంగా సెప్టెంబరు 20న విపక్ష సభ్యుల అనుచిత ప్రవర్తనను నిరసిస్తూ మంగళవారం ఉదయం ఒక్క రోజు దీక్ష చేపట్టారు డిప్యూటీ ఛైర్మన్​ హరివంశ్ నారాయణ్ సింగ్​. బుధవారం దీక్షను విరమించారు.

వ్యవసాయ బిల్లుల ఆమోదం సమయంలో అనుచితంగా ప్రవర్తించిన 8 మంది విపక్ష సభ్యులపై సోమవారం సస్పెన్షన్​ వేటు వేశారు ఛైర్మన్​. ఈ చర్యను నిరసిస్తూ వారంతా ఆ రోజు రాత్రి పార్లమెంటు ఆవరణలోనే గడిపారు. మరునాడు ఉదయం వారికి టీ తీసుకెళ్లారు హరివంశ్. అయితే 8మంది సభ్యులు టీని నిరాకరించారు. ఆ తర్వాత తాను దీక్ష చేస్తూనే బాధ్యతలు నిర్వర్తిస్తానని ఛైర్మన్​కు లేఖ రాశారు హరివంశ్.

8మంది సభ్యులపై సస్పెన్షన్ వేటు ఎత్తివేయాలని మంగళవారం రోజు సభలో డిమాండ్​ చేశాయి విపక్షాలు. ఇందుకు ఛైర్మన్ వెంకయ్య నాయుడు నిరాకరించారు. అనంతరం విపక్ష సభ్యులందరూ సభ నుంచి వాకౌట్​ చేశారు. పార్లమెంటు ఆవరణలో నిరసన వ్యక్తం చేశారు.

For All Latest Updates

ABOUT THE AUTHOR

...view details