తెలంగాణ

telangana

ETV Bharat / bharat

మదన్​ లాల్​ సైనీకి రాజ్యసభ నివాళి - ఛైర్మన్

ఎంపీ మదన్ ​లాల్​ సైనీ మృతి పట్ల రాజ్యసభ సంతాపం వ్యక్తం చేసింది. 2 నిమిషాల పాటు సభ్యులు మౌనం పాటించారు. మదన్​ లాల్ సేవలను రాజ్యసభ ఛైర్మన్ వెంకయ్యనాయుడు గుర్తుచేశారు. ఆయన గౌరవార్థం సభను 3 గంటల పాటు వాయిదా వేశారు.

ఇవాళ రాజ్యసభ 3గంటలు వాయిదా

By

Published : Jun 25, 2019, 12:45 PM IST

Updated : Jun 25, 2019, 2:06 PM IST

భాజపా ఎంపీ మదన్​ లాల్ సైనీ మృతి పట్ల రాజ్యసభ సంతాపం వ్యక్తం చేసింది. ఆయన గౌరవార్థం సభను 3 గంటల పాటు ఛైర్మన్​ వెంకయ్య నాయుడు వాయిదా వేశారు. సమావేశమైన వెంటనే ఈ విషయాన్ని ప్రస్తావించారు ఛైర్మన్. ఆయన సేవలను గుర్తుచేశారు. సభ నిబద్ధత కలిగిన నేతను కోల్పోయిందని ఆవేదన వ్యక్తం చేశారు.

ఇవాళ రాజ్యసభ 3గంటలు వాయిదా

2 నిమిషాల పాటు సభ మౌనం పాటించింది. అనంతరం సభను వాయిదా వేస్తున్నట్లు వెంకయ్య ప్రకటించారు.

మధ్యాహ్నం 2 గంటలకు సభ పునఃప్రారంభమయ్యాక రాష్ట్రపతి ప్రసంగంపై ధన్యవాద తీర్మానంపై చర్చ పూర్తి చేయనున్నారు. తర్వాత ప్రధాని నరేంద్ర మోదీ రాష్ట్రపతి ప్రసంగంపై సమాధానమిస్తారు.

సోమవారం మృతి...

ఊపిరితిత్తుల సమస్యతో ఎయిమ్స్​లో చికిత్స తీసుకుంటూ మదన్​ లాల్ సైనీ (75) సోమవారం కన్నుమూశారు. 3 గంటల వరకు సభను వాయిదా వేసేలా రాజ్యసభ ఛైర్మన్, 15 పార్టీల నేతలతో చర్చించి నిర్ణయం తీసుకున్నారు.

Last Updated : Jun 25, 2019, 2:06 PM IST

ABOUT THE AUTHOR

...view details