తెలంగాణ

telangana

ETV Bharat / bharat

బారికేడ్ల వల్ల ప్రమాదం- బాధితుడికి రూ.75 లక్షలు పరిహారం - Justice Navin Chawla

రోడ్డు ప్రమాదంలో తీవ్రంగా గాయపడి చికిత్స పొందుతోన్న యువకుడికి రూ. 75 లక్షల పరిహారం ఇవ్వాలని దిల్లీ పోలీసులను ఆదేశించింది హైకోర్టు. పోలీసుల నిర్లక్ష్యం, వైఫల్యంతోనే ప్రమాదం జరిగిందని.. బాధితుడు పరిహారం పొందేందుకు అర్హుడని పేర్కొంది.

Rs 75 Lakh Compensation For Delhi Man After Accident Due To Barricades
దిల్లీ పోలీసులకు హైకోర్టు షాక్

By

Published : May 21, 2020, 3:31 PM IST

రోడ్డుపై ఏర్పాటు చేసిన బారికేడ్ల కారణంగా ప్రమాదానికి గురైన ఓ యువకుడికి రూ. 75 లక్షల పరిహారం చెల్లించాలని దిల్లీ పోలీసులను ఆదేశించింది అక్కడి హైకోర్టు. పోలీసుల విధి నిర్వహణలో నిర్లక్ష్యం, వైఫల్యంతోనే ప్రమాదం జరిగిందని.. బాధితుడు తనకు జరిగిన నష్టానికి పరిహారం పొందేందుకు అర్హుడని స్పష్టం చేసింది.

ఇదీ జరిగింది..

2015 డిసెంబర్​లో ఓ రోజు ఉదయం ధీరజ్​ కుమార్​ (ఆ సమయంలో 21 ఏళ్లు), అతని తండ్రి బైక్​పై ఇంటికి తిరిగివస్తున్న క్రమంలో రోడ్డుపై ఏర్పాటు చేసిన బారికేడ్లను ఢీకొని గాయపడ్డారు. ధీరజ్​ అపస్మారక స్థితిలోకి వెళ్లాడు. పలుమార్లు శస్త్రచికిత్స చేశాక అపస్మారక స్థితి నుంచి కోలుకున్నాడు. కానీ, మాట్లాడలేకపోతున్నాడు.

ప్రమాదం కారణంగా నష్టపోయిన ఆదాయం, వైద్య ఖర్చులు, భవిష్యత్తు అవసరాల కోసం పరిహారం చెల్లించాలని కోరుతూ కోర్టును ఆశ్రయించారు బాధితులు.

ధీరజ్​కుమార్​ నిర్లక్ష్యంతోనే ప్రమాదం జరిగిందని కోర్టులో వాదించారు దిల్లీ పోలీసులు. వేగంగా రావటం వల్ల సరైన సమయంలో బ్రేక్​ వేయలేక బారికేడ్లకు ఢీకొన్నారని వివరించారు. బారికేడ్లను సరైన వెలుతురు ఉన్న ప్రాంతంలో, దూరం నుంచి చూసినా కనిపించేలా అన్ని ఏర్పాట్లు చేసినట్లు తెలిపారు. ధీరజ్ కుమార్ హెల్మెట్​ ధరించకుండా నిర్లక్ష్యంగా వ్యవహరించి, మోటారు వాహనాల చట్టాన్ని ఉల్లంఘించారని వాదించారు దిల్లీ పోలీసులు. అయితే.. బాధితులు హెల్మెట్​ ధరించారని కోర్టుకు నివేదించారు ధీరజ్​ తరఫు న్యాయవాది.

ఇరు పక్షాల వాదనలు విన్న న్యాయస్థానం... రోడ్డుపై ఏర్పాటు చేసిన బారికేడ్లు దూరం నుంచి కనబడేలా ఎలాంటి రిఫ్లెక్టర్లు, బ్లింకర్లను ఏర్పాటు చేయలేదని నిర్ధరించింది. ధీరజ్​కు రూ. 75 లక్షలు పరిహారం ఇవ్వాలని దిల్లీ పోలీసుల్ని ఆదేశించింది.

ABOUT THE AUTHOR

...view details