ఒడిశా భువనేశ్వర్‌కు సమీపంలోని పంచగయన్ గ్రామంలో ఓ నిరుపేద దివ్యాంగుల కుటుంబానికి.. ఏకంగా రూ.58 లక్షల విద్యుత్ బిల్లు రావడం ఆశ్చర్యానికి గురిచేసింది. ప్రసన్నా నాయక్, అతని భార్య ఇద్దరూ అంధులే. వీరి ఇంట్లో కేవలం నాలుగు విద్యుత్ దీపాలు, రెండు ఫ్యాన్లు ఉన్నాయి. వీటికి 7 నెలలుగా విద్యుత్ బిల్లు చెల్లించకపోవడం కారణంగా భారీ మెుత్తంగా రూ. 58 లక్షల విద్యుత్ బిల్లును వడ్డించారు.
రెండు ఫ్యాన్లు, 4 లైట్లు.. కరెంట్ బిల్లు రూ.58 లక్షలు! - electricity bill
ఒడిశాలోని ఓ కుటుంబం తమకు వచ్చిన కరెంట్ బిల్లు చూసి షాక్ అయింది. వందలు కాదు వేలు కాదు ఏకంగా రూ. 58 లక్షల విద్యుత్ బిల్లు వచ్చింది. ఫిర్యాదు చేసినా కరెంట్ ఆఫీస్ నుంచి ఎలాంటి స్పందన లేదని వారు వాపోయారు.
నిరుపేద కుటుంబానికి రూ. 58 లక్షల విద్యుత్ బిల్లు వడ్డన
లక్షల్లో వచ్చిన బిల్లును తాము చెల్లించలేమని వాపోతోంది ప్రసన్నా నాయక్ కుటుంబం. గతంలోనూ ఇలాగే రూ.18 వేల బిల్లు వస్తే అధికారులను అభ్యర్థించి రూ. 9,700 చెల్లించామని తెలిపారు. అయితే ఇప్పడు ఇంత డబ్బు తాము చెల్లించలేమని.. ఇదివరకే విద్యుత్ అధికారులకు ఫిర్యాదు చేశామని నాయక్ తెలిపారు. సమస్యపై అధికారులు స్పందించకపోతే వినియోగదారుల ఫోరంను ఆశ్రయిస్తా అన్నారు.