తెలంగాణ

telangana

ETV Bharat / bharat

పార్టీలకు రూ.2,512 కోట్లు విరాళాలు.. ఇచ్చిందెవరో తెలీదు! - BJP

వివిధ రాజకీయ పార్టీల విరాళాలకు సంబంధించి.. ఆసక్తికర విషయాలు వెల్లడించింది అసోసియేషన్​ ఫర్​ డెమొక్రాటిక్ రిఫామ్స్​ (ఏడీఆర్​) సంస్థ. 2018-19లో విరాళాల రూపంలో అన్ని పార్టీలకు కలిపి రూ.2,512.98 కోట్లు వచ్చినట్లు విశ్లేషణలో వెలుగుచూసింది.

Rs. 2,512 Cr Donations have been rised to different parties across India. Don't know the details
పార్టీలకు రూ.2,512 కోట్లు విరాళాలు.. ఇచ్చిందెవరో తెలీదు!

By

Published : Mar 10, 2020, 7:06 AM IST

పారదర్శకత పాటించాల్సిన రాజకీయపార్టీలు తమకు విరాళాలు ఇచ్చిన వారి పేర్లు బయటపెట్టడం లేదు. ఈ సమాచారం లేకుండానే కేంద్ర ఎన్నికల సంఘానికి నివేదికలు సమర్పిస్తున్నాయి. ప్రస్తుత నిబంధనల ప్రకారం రూ.20వేల లోపు విరాళాలు ఇచ్చినవారి పేర్లుకానీ, ఎలక్టోరల్‌ బాండ్లు కొనుగోలు చేసిన వారి వివరాలుకానీ వెల్లడించాల్సిన అవసరం లేదు. అయితే ఈ తరహా స్వల్ప మొత్తాల రూపంలో అత్యధికంగా విరాళాలు సమకూరుతుండడం గమనార్హం. నిబంధనను సాకుగా చూపించి దాతల వివరాలను పార్టీలు అజ్ఞాతంగా ఉంచుతున్నాయి. అసోసియేషన్‌ ఫర్‌ డెమొక్రాటిక్‌ రిఫామ్స్‌ (ఏడీఆర్‌) సంస్థ జరిపిన విశ్లేషణలో మరిన్ని ఆసక్తికర విషయాలు వెలుగుచూశాయి.

* 2018-19లో ఈ రూపంలో అన్ని పార్టీలకు కలిపి రూ.2,512.98 కోట్లు వచ్చాయి. అందులో భాజపాకు అందినవి రూ.1,612.04 కోట్లు. అంటే 64 శాతం ఆ పార్టీ ఖాతాలో పడ్డాయి. కాంగ్రెస్‌కు లభించినవి రూ.728.88 కోట్లు.

* అజ్ఞాత విరాళాల్లో 78 శాతం ఎలక్టోరల్‌ బాండ్ల రూపంలో సమకూరింది. ఈ బాండ్లు కొనుగోలు చేసిన వారి చిరునామాలు తెలియవు. వీటి విలువ రూ.1,960.68 కోట్లు. అంటే ఎక్కువ మంది పేర్లు వెల్లడించడానికి ఇష్టపడకుండా ఎలక్టోరల్‌ బాండ్లు కొనుగోలు చేస్తున్నారు.

* పేర్లు బయటికి తెలిసేలా రూ.20వేలకు మించిన విలువ చేసే ఎలక్టోరల్‌ బాండ్లను చాలా తక్కువ మంది కొనుగోలు చేస్తున్నారు. ఈ తరహాలో సమకూరింది. రూ.71.44 లక్షలే.

* తమకు రూ.20వేల విలువకు మించిన బాండ్లేవీ రాలేదని బీఎస్పీ తెలిపింది.

For All Latest Updates

ABOUT THE AUTHOR

...view details