తెలంగాణ

telangana

ETV Bharat / bharat

చెత్త ఏరుకునేవారి ఇంట్లో బిందెల నిండా నాణేలే! - 2 lakhs change found in beggar's house in chennai

తమిళనాడులో చెత్త ఏరుకుని జీవించే వారింట్లో దాదాపు రూ.2 లక్షలు విలువ చేసే చిల్లర నాణేలు లభ్యమయ్యాయి. రూ.40 వేలు విలువైన చలామణిలో లేని నోట్లు, బంగారమూ బయటపడ్డాయి.

Rs. 2 lakhs of coins and money found in waste collecting old women's house
చెత్త ఏరుకునే అవ్వ ఇంట్లో బిందెల నిండా నాణేలే!

By

Published : Aug 14, 2020, 3:02 PM IST

తమిళనాడులో రోడ్డు పక్కన నివసించేవారింట్లో అక్షరాలా రూ. 2 లక్షలు విలువ చేసే నాణేలు దొరికాయి.

చెన్నై, ఒట్టేరి, సత్యవాణిముత్తు నగర్​కు చెందిన రాజేశ్వరి (65), విజయలక్ష్మి (60), ప్రభావతి (57)లకు ఇల్లు ఉన్నా.. రోడ్డు పక్కనే నివసించేవారు. దీంతో పోలీసులు వారి ఇంటిని తనిఖీ చేశారు. ఆ ఇంట్లో లభ్యమైన ప్లాస్టిక్ బిందెల్లో నింపిన చిల్లర నాణేలు, ఏడు సవర్ల బంగారం, రూ. 40 వేలు విలువ చేసే రద్దయిన 500, 1000 రూపాయల పాత నోట్లు లభ్యమయ్యాయి. ఇవి చూసి ఇరుగుపొరుగువారు విస్తుపోయారు.

చెత్త ఏరుకునే అవ్వ ఇంట్లో బిందెల నిండా నాణేలే!

ఇదీ చదవండి: భర్తను చంపి ముక్కలుగా నరికి.. సంచిలో!

For All Latest Updates

TAGGED:

ABOUT THE AUTHOR

...view details