తెలంగాణ

telangana

ETV Bharat / bharat

'ఆ  వ్యక్తిని గుర్తు పడితే రూ.లక్ష బహుమతి' - bjp

నోట్ల రద్దు తర్వాత ఓ వెబ్​సైట్​ విడుదల చేసిన వీడియోలో వ్యక్తిని గుర్తుపడితే లక్ష రూపాయల బహుమతి ఇస్తామని కాంగ్రెస్ నేత కపిల్​ సిబల్​ ప్రకటించారు. గుజరాత్​ అహ్మదాబాద్​లోని ఓ వ్యక్తి రూ. 5 కోట్ల రూపాయల పాతనోట్లను అక్రమమార్గంలో మార్చినట్టు ఆ వీడియోలో ఉంది. నోట్ల రద్దు సమయంలో భారీ ఎత్తున నల్లధనాన్ని కొత్త నోట్లలోకి మార్చారని కపిల్​ ఆరోపించారు.

కాంగ్రెస్ నేత కపిల్​ సిబల్

By

Published : Apr 20, 2019, 5:53 AM IST

Updated : Apr 20, 2019, 7:13 AM IST

కాంగ్రెస్ నేత కపిల్​ సిబల్

కాంగ్రెస్ సీనియర్ నేత కపిల్​ సిబల్​ ఓ సవాల్​ విసిరారు. ఓ వీడియో చూపిస్తూ అందులో గడ్డంతో ఉన్న వ్యక్తి ఎవరో చెబితే కాంగ్రెస్ పార్టీ లక్ష రూపాయల బహుమానం అందజేస్తుందని ప్రకటించారు.

ఓ పరిశోధక పాత్రికేయుడు చేసిన స్ట్రింగ్​ ఆపరేషన్​ వీడియోను టీఎన్​ఎన్​ అనే వెబ్​సైట్​ బయటపెట్టిందని సిబల్​ తెలిపారు.

"ఈ ఘటన అహ్మదాబాద్​లో జరిగింది. 2016 డిసెంబర్​ 31 తర్వాతి విషయమిది. ఓ గడ్డంతో ఉన్న వ్యక్తి కమలం పార్టీ ఆఫీసు నుంచి ఒక బ్యాగుతో వచ్చాడు. అతనితో పరిశోధక పాత్రికేయుడు మాట్లాడుతూ.. 'మేం మీకు 5 కోట్లు ఇస్తున్నాం. బదులుగా మీరు కొత్త నోట్లతో 3 కోట్లే ఇస్తున్నారు. ఎక్కువగా కమిషన్​ తీసుకుంటున్నారని ప్రశ్నించాడు. మాకు తక్కువగానే మిగులుతుంది, పై వాళ్లే ఎక్కువగా తీసుకుంటారు' అని గడ్డం వ్యక్తి చెబుతాడు. మీకు కావాలంటే ఎంత డబ్బైనా, ఎక్కడైనా మార్పిడి చేసి ఇస్తామంటాడు. ఏ ఆటంకం లేకుండా ఆ వ్యక్తి పాత నోట్లను మార్చుకున్నాడు. ఈ వ్యవహారంలో దళారులు, బ్యాంకర్లు, రాజకీయ నాయకుల పాత్ర ఉంది. ఈ నోట్ల రద్దు భారత చరిత్రలోనే అతిపెద్ద కుంభకోణం."

-కపిల్ సిబల్, కాంగ్రెస్ సీనియర్ నేత

ఇదీ చూడండి: భారత్​ భేరి: ఓటెవరికి... దేశానికా? నగరానికా??

Last Updated : Apr 20, 2019, 7:13 AM IST

ABOUT THE AUTHOR

...view details