తెలంగాణ

telangana

ETV Bharat / bharat

మూడు కోడిగుడ్ల ధర 1672 రూపాయలా..? - రెండు అరటిపండ్లకు ఓ స్టార్‌ హోటల్‌.. వందల్లో బిల్లు

రెండు అరటిపండ్లకు ఓ స్టార్‌ హోటల్‌.. వందల్లో బిల్లు వేసిన ఘటన మరవకముందే అలాంటి ఘటన మరొకటి చోటు చేసుకుంది. గుజరాత్‌ అహ్మదాబాద్‌లోని హయత్‌ రీజెన్సీ స్టార్‌ హోటల్‌లో బస చేసిన ప్రముఖ సంగీత దర్శకుడు శేఖర్‌ రావ్‌జియానికి.. మూడు ఉడకబెట్టిన కోడిగుడ్లకు ఏకంగా రూ.1672లు ఛార్జ్​ చేశారు. ఈ విషయాన్ని స్వయంగా తన ట్విట్టర్​లో పోస్ట్​ చేశారు శేఖర్​.

మూడు కోడిగుడ్ల ధర ఎంతో తెలుసా?

By

Published : Nov 15, 2019, 9:56 PM IST

ఓ స్టార్‌ హోటల్‌లో రెండు అరటిపండ్లకు వందల్లో బిల్లు వేసిన ఘటన గుర్తుంది కదా.. అలాంటి నిర్వాకమే మరో స్టార్‌ హోటల్‌లో చోటుచేసుకుంది. అయితే వీరు మూడు కోడిగుడ్లకు వేలల్లో బిల్లు వేశారు. వివరాల్లోకి వెళ్తే.. ప్రముఖ సంగీత దర్శకుడు శేఖర్‌ రావ్‌జియాని గురువారం గుజరాత్‌ అహ్మదాబాద్‌లోని హయత్‌ రీజెన్సీ స్టార్‌ హోటల్‌లో మూడు ఉడకబెట్టిన కోడిగుడ్లతో భోజనం ఆర్డర్‌ ఇచ్చారు. భోజనం చేసిన అనంతరం బిల్లు చూసి ఆయన ఒక్కసారిగా షాక్‌ అయ్యారు. ఎందుకంటే మూడు కోడిగుడ్ల ధర రూ.1672లుగా ఉంది. ఈ విషయాన్ని ఆయన ట్విట్టర్‌లో తెలిపారు.

మూడు కోడిగుడ్ల ధర ఎంతో తెలుసా?

ఆ బిల్లులో మూడు ఉడికించిన కోడిగుడ్లకు రూ.1350, సర్వీస్‌ ఛార్జీగా రూ.67, సీజీఎస్టీ రూ.127, ఎస్‌జీఎస్టీ 127.. మొత్తం బిల్లు రూ.1672లుగా ఉంది. శేఖర్‌ బిల్లుతో సహా ట్వీట్‌ చేయడంతో ఇది కాస్త ఇప్పుడు వైరల్‌గా మారింది.

గత జులైలో నటుడు రాహుల్‌ బోస్‌కు కూడా ఇలాంటి ఘటనే ఎదురైంది. చండీగఢ్‌లోని ఓ హోటల్‌లో ఆయనకు రెండు అరటి పండ్లకు గానూ రూ.442ల బిల్లును హోటల్‌ సిబ్బంది అందించారు. దీనిని ఆయన అప్పట్లో ట్విట్టర్‌లో షేర్‌ చేశారు. ఈ ఘటనపై స్పందించిన ఎక్సైజ్‌ అండ్‌ టాక్సేషన్‌ డిపార్ట్‌మెంట్‌ ఆ హోటల్‌కు రూ.25 వేల జరిమానా కూడా విధించింది.

ABOUT THE AUTHOR

...view details