ఒడిశాలో పట్టపగలే అందరూ చూస్తుండగానే దోపీడీకి పాల్పడ్డారు దుండగులు. కేంద్ర్పాడా జిల్లాలోని బనియామల వద్ద ఓ ప్రైవేట్ ఏజెంట్ నుంచి రూ.1 లక్ష దోచుకున్నారు. ఈ ఘటనకు సంబంధించిన దృశ్యాలన్ని స్థానిక సీసీ కెమెరాల్లో నిక్షిప్తమయ్యాయి.
పట్టపగలు అందరూ చూస్తుండగానే రూ.1లక్ష చోరీ - పట్టపగలే లూటీ
ఒడిశాలో పట్టపగలే దొంగతనానికి పాల్పడ్డారు గుర్తు తెలియని వ్యక్తులు. బ్యాంక్ సమీపంలో పార్క్ చేసిన బైక్‌లో లక్ష రూపాయల నగదును దోచుకెళ్లారు. స్థానిక సీసీటీవీ కెమెరాల్లో ఈ దృశ్యాలు రికార్డయ్యాయి.
పట్టపగలే లూటీ- రూ.1లక్ష ఎత్తుకెళ్లిన దుండగులు
ఓ ప్రైవేట్ సంస్థ ఉద్యోగి అయిన పాండా.. ఈ నెల 15న(శుక్రవారం) లక్ష రూపాయల నగదును బ్యాంక్‌లో విత్ డ్రా చేసుకున్నాడు. సమీపంలోని సహకార బ్యాంకులో ఆ సొమ్మును జమచేసేందుకు ఓ బ్యాగ్‌లో ఉంచాడు. సంబంధిత బ్యాంక్ వద్దకు వచ్చి.. బైక్ పార్క్ చేసి మరో ఏజెంట్‌తో మాట్లాడుతున్నాడు పాండా. ఇంతలో డబ్బుపై కన్నేసిన దుండగులు.. బైక్‌పై వచ్చి ఆ బ్యాగ్‌ను కాజేశారు.
ఇదీ చదవండి:రెండో భార్యతో కలిసి కన్నపిల్లలపై కర్కశత్వం!
Last Updated : Jan 18, 2021, 7:16 AM IST