తెలంగాణ

telangana

ETV Bharat / bharat

ప్రాంతీయ భాషల్లో ఆర్​ఆర్​బీ, బ్యాంకింగ్​ పరీక్షలు

గ్రామీణ యువతకు ప్రయోజనం కలిగించేలా ఇకపై నిర్వహించే ఆర్ఆర్​బీ, ప్రాంతీయ గ్రామీణ బ్యాంకుల పరీక్షలను హిందీ, ఆంగ్లం సహా 13 ప్రాంతీయ భాషల్లో నిర్వహించనున్నారు. కేంద్ర ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ ఈ విషయాన్ని​ లోక్​సభలో ప్రకటించారు.

By

Published : Jul 4, 2019, 1:54 PM IST

ప్రాంతీయ భాషల్లో ఆర్​ఆర్​బీ, బ్యాంకింగ్​ పరీక్షలు

ఆర్​ఆర్​బీ, ప్రాంతీయ గ్రామీణ బ్యాంకుల పరీక్షలను ఇకపై ప్రాంతీయ భాషల్లో నిర్వహిస్తామని కేంద్ర ఆర్థికమంత్రి నిర్మలా సీతారామన్ తెలిపారు. మొత్తం 13 భాషల్లో ఈ పరీక్షలు రాసే వెసులుబాటు కల్పించనున్నట్లు ఆమె లోక్​సభలో ప్రకటించారు.

ప్రస్తుతం హిందీ, ఆంగ్ల మాధ్యమాల్లో మాత్రమే ఈ పరీక్షలు నిర్వహిస్తున్నారు. ఈ కారణంగా స్థానిక భాషల్లో చదువుకున్న గ్రామీణ యువత తీవ్రంగా ఇబ్బందిపడుతున్నారు. వీరికి ప్రయోజనం కలిగేలా తాజా నిర్ణయం తీసుకున్నట్లు నిర్మలా సీతారామన్ తెలిపారు.

ప్రాంతీయ భాషల్లో ఆర్​ఆర్​బీ, బ్యాంకింగ్​ పరీక్షలు : నిర్మలా సీతారామన్​

"స్థానిక యువతకు సమప్రాధాన్యం ఇవ్వడం సహా ఉద్యోగ అవకాశాలను కల్పించాలనే ఉద్దేశంతో ఈ నిర్ణయం తీసుకున్నాం. ఇకపై ప్రాంతీయ గ్రామీణ బ్యాంకుల్లో స్కేల్​-1 అధికారులు, ఆర్​ఆర్​బీ ఆఫీస్​ అసిస్టెంట్ ఉద్యోగాలకు సంబంధించిన పరీక్షలు హిందీ, ఆంగ్లం సహా 13 ప్రాంతీయ భాషల్లో నిర్వహించాలని నిర్ణయించాం."
- నిర్మలా సీతారామన్​, కేంద్ర ఆర్థికమంత్రి

ఇదీ చూడండి: భాజపాపై సైద్ధాంతిక పోరు ఆగదు : రాహుల్​

ABOUT THE AUTHOR

...view details