తెలంగాణ

telangana

ETV Bharat / bharat

పట్టాలపై పహారా కాస్తున్న ముంబయి 'యముడు' - ముంబయిలో భద్రత అంశాల​పై అవగాహన కార్యక్రమం

ముంబయిలో ప్రత్యక్షమైన యమధర్మరాజు ప్రజల ప్రాణాలు కాపాడుతున్నాడు. ప్రమాదం ఉందని ముందే హెచ్చరించి వారిని అప్రమత్తం చేస్తున్నాడు. పట్టాలను దాటేవారిని, నడిచేవారిని పట్టుకెళ్లిపోతున్నాడు. ఇంతకీ ఆ యముడు ఎందుకిలా మారాడు?

పట్టాలపై పహారా కాస్తున్న ముంబయి 'యముడు'

By

Published : Nov 10, 2019, 6:47 AM IST

పట్టాలపై పహారా కాస్తున్న ముంబయి 'యముడు'
ముంబయిలోని పశ్చిమ మధ్య రైల్వేలో భద్రత అంశాల​పై అవగాహన కార్యక్రమం నిర్వహించింది రైల్వే రక్షక దళం(ఆర్పీఎఫ్). 'యమ ధర్మ రాజు' వేషధారణలో పట్టాలపైకి వచ్చిన సిబ్బంది.. వాటిపై నడవటం, దాటడం వంటివి చేసేవారిని ఎత్తుకెళతానని హెచ్చరిస్తోంది.

అడ్డదారే కదా అని వేళితే..

'అడ్డదారిలో వెళితే.. యముడి చేతికి అడ్డంగా చిక్కుతారు' అనే సందేశాన్ని ఇస్తూ.. స్టేషన్ల సమీపంలోని పట్టాలపై నడిచే వారిని ఎత్తుకెళ్లాడు ఈ ఆర్పీఎఫ్​ యమధర్మరాజు.

ఈ అవగాహన కార్యక్రమం మొదట అంధేరి, మలాడ్ స్టేషన్లలో నిర్వహించారు. అక్కడ ఈ నాటకానికి యమ క్రేజ్​ వచ్చేసరికి.. ఇతర స్టేషన్లలోనూ ప్రారంభించారు.

అత్యంత రద్దీ రైల్వే..

ముంబయి సబర్బన్ నెట్‌వర్క్ ప్రపంచంలోనే అత్యంత రద్దీ రైల్వేల్లో ఒకటి. రోజూ 70 లక్షల మంది ప్రయాణికులతో కిటకిటలాడుతుంది. ఇక్కడ రోజురోజుకూ ప్రమాదాల సంఖ్య పెరుగుతూనే ఉంది.

2019 అక్టోబర్ వరకు ట్రాక్ క్రాసింగ్ వల్ల రైల్వే చట్టం, సెక్షన్ 147 కింద సుమారు 13,463 మందిని విచారించాల్సి వచ్చిందని పశ్చిమ మధ్య రైల్వే అధికారులు తెలిపారు. అయితే ఈ కార్యక్రమం​ నిర్వహించిన ప్రాంతాల్లో సెప్టెంబర్​లో 7 శాతం మరణాలు, 30 శాతం ప్రమాదాలు తగ్గాయని చెప్పుకొచ్చారు అధికారులు.

ఇదీ చదవండి:'అయోధ్య'పై నాడు సయోధ్య తీర్పు

ABOUT THE AUTHOR

...view details