తెలంగాణ

telangana

ETV Bharat / bharat

అయోధ్య తీర్పు ముందు రైల్వే స్టేషన్లు అలర్ట్​ - sc ayodhya verdict

అయోధ్య కేసుపై సుప్రీం తీర్పుపై దేశమంతా ఉత్కంఠగా ఎదురుచూస్తోంది. ఈ నేపథ్యంలో అన్ని రైల్వే జోన్లు అప్రమత్తంగా ఉండాలని ఆర్​పీఎఫ్​ అదేశించింది. అల్లర్లు జరిగే అవకాశమున్న ప్రాంతాల్లో కట్టుదిట్టమైన భద్రత ఏర్పాటు చేయాలని సూచించింది.

అయోధ్య తీర్పు ముందు రైల్వే స్టేషన్లు అప్రమత్తం..

By

Published : Nov 7, 2019, 7:49 PM IST

Updated : Nov 7, 2019, 10:12 PM IST

అయోధ్య తీర్పు ముందు రైల్వే స్టేషన్లు అలర్ట్​

అయోధ్య కేసుపై తీర్పు వెలువడనున్న నేపథ్యంలో రైల్వే భద్రతా దళం(ఆర్​పీఎఫ్​) పలు సూచనలు జారీ చేసింది. ముందస్తు జాగ్రత్త చర్యల్లో భాగంగా భద్రతాపరమైన ఏర్పాట్లు చేయాలని అన్ని రైల్వే జోన్లకు సూచించింది. ఈ మేరకు ఏడు పేజీల లేఖను పంపింది.

ఆర్పీఎఫ్‌ సిబ్బంది సెలవులనూ రద్దుచేసిన అధికారులు.. రైళ్లకు రక్షణగా ఉండాలని ఆదేశించారు. ముంబయి, దిల్లీ, మహారాష్ట్ర, యూపీలలోని రైల్వే స్టేషన్లు సహా 78 స్టేషన్లలో కట్టుదిట్టమైన భద్రతా ఏర్పాట్లు అవసరమని ఆర్పీఎఫ్ తెలిపింది. మరింత మంది సిబ్బందిని మోహరించాలని సూచించింది.

రైల్వే ప్లాట్‌ఫామ్‌లు, స్టేషన్లు, యార్డులు,పార్కింగ్ స్థలాలు,వంతెనలు, టన్నెల్స్, ఉత్పత్తి యూనిట్లు, వర్క్‌షాప్‌లలో కట్టుదిట్టమైన భద్రతను ఏర్పాటు చేయాలని ఆర్పీఎఫ్ పేర్కొంది. అల్లర్లు, పేలుడు పదార్థాలను దాచేందుకు అవకాశమున్న ప్రాంతాలను గుర్తించి అప్రమత్తంగా ఉండాలని సూచించింది. రైల్వే స్టేషన్లకు సమీపంలోని ప్రార్థన స్థలాలు, మత సంబంధిత నిర్మాణాలపై ప్రత్యేక దృష్టి సారించాలని తెలిపింది.

ఇదీ చూడండి: ఈ నెల 13,14న జరిగే బ్రిక్స్​ సదస్సుకు మోదీ

Last Updated : Nov 7, 2019, 10:12 PM IST

ABOUT THE AUTHOR

...view details