ఒడిశాలోని రవుర్కెలా స్టీల్ ప్లాంట్(ఆర్ఎస్పీ)లో విషవాయువు లీకై నలుగురు ప్రాణాలు కోల్పోయారు. పలువురు తీవ అనారోగ్యానికి గురయ్యారు. బాధితులను ఆసుపత్రికి తరలించారు.
ఆర్ఎస్పీ ప్రాంగణంలోని బొగ్గు రసాయన విభాగంలో మరమ్మతులు చేస్తుండగా కార్బన్ మోనాక్సైడ్ గ్యాస్ లీక్ అయ్యింది. బుధవారం ఉదయం 9:45 గంటల ప్రాంతంలో ఈ ఘటన జరిగింది. ఈ ఘటనలో సుమారు 10మంది వరకు తీవ్ర అస్వస్థతకు గురయ్యారు.